YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిలకు( Y S Sharmila ) ఘోర అవమానం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న ఆమెకు ఆహ్వానం పంపలేదు తమిళనాడు సీఎం స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డి లిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుండడం పై స్టాలిన్ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా నిన్ననే ఉద్యమ భేటీ నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. కానీ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను ఆహ్వానించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: బిజెపిని వ్యతిరేకించని జగన్!
* అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతల హాజరు
స్టాలిన్ ( Tamil Nadu CM Stalin ) నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. మరోవైపు కేరళ సీఎం పినరాయి విజయన్ సైతం వచ్చారు. ఒడిస్సా నుంచి బిజెపి ప్రతినిధులతో పాటు తెలంగాణ నుంచి కేటీఆర్ హాజరయ్యారు. ఇంతటి సమావేశానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న షర్మిలకు ఆహ్వానం పంపకపోవడం పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు జగన్ కారణం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* జగన్ తో సాన్నిహిత్యం
తమిళనాడు సీఎం స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy)అత్యంత సన్నిహితుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో స్టాలిన్ హాజరయ్యారు. రాజకీయంగా కూడా పరస్పరం సహకారం అందించుకునేవారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మూలంగానే షర్మిలను స్టాలిన్ ఆహ్వానించలేదా? లేకుంటే ఆమె స్థాయి అంత కాదని భావించారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే దీనిని అవమానంగా భావిస్తున్నారు షర్మిల. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలను పిలిచి ఏపీని విస్మరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి అవమానంగా చెబుతున్నారు.
* హై కమాండ్ కు ఫిర్యాదు..
ఏపీలో టీడీపీ, జనసేన ఎన్డీఏ ( National democratic Alliance)భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దీంతో ఆ రెండు పార్టీలను ఆహ్వానించలేదు స్టాలిన్. అయితే జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ పార్టీకి సైతం ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే జనసేనను ఆహ్వానించి.. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను విస్మరించడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. స్టాలిన్ పోరాడుతోంది దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యంతో ఏపీ కాంగ్రెస్ ను విస్మరించడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. ఈ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు షర్మిల సిద్ధపడుతున్నట్లు సమాచారం.