YS Jagan : జగన్ ఆ సాహసం చేయగలరా? అలా చేస్తే రెండు స్థానాలు టిడిపి ఖాతాలోనే..

2011లో కాంగ్రెస్ పార్టీని విభేదించారు జగన్. వైసీపీని ఏర్పాటు చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అద్భుత మెజారిటీని సొంతం చేసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యే సీట్లను సైతం కైవసం చేసుకున్నారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒక జాతీయ పార్టీ. పైగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి కొంతవరకు సహకారం అందే సమయం అది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ ఫలితం వస్తుందా? అంటే మాత్రం మౌనమే సమాధానమవుతోంది.

Written By: NARESH, Updated On : July 8, 2024 2:18 pm

YS Jagan

Follow us on

YS Jagan : జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? కడప ఎంపీగా పోటీ చేస్తారా? అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయిస్తారా? పులివెందుల నుంచి విజయమ్మని బరిలో దింపుతారా? ఆమె ఒప్పుకోకుంటే భారతితో పోటీ చేయిస్తారా? గత రెండు రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎవరికి తోచినట్టు వారు విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ ఒక బలమైన నిర్ణయానికి వచ్చేసారు అని చెబుతున్నారు. తాను ఉన్న పరిస్థితుల్లో కేంద్ర రాజకీయాల వైపు వెళితేనే ఉపయోగ ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే అంతటి సాహసం జగన్ చేస్తారా? చేయగలరా? అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

* ఆ పరిస్థితి ఉందా?
2011లో కాంగ్రెస్ పార్టీని విభేదించారు జగన్. వైసీపీని ఏర్పాటు చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అద్భుత మెజారిటీని సొంతం చేసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యే సీట్లను సైతం కైవసం చేసుకున్నారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒక జాతీయ పార్టీ. పైగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి కొంతవరకు సహకారం అందే సమయం అది. కానీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఆ ఫలితం వస్తుందా? అంటే మాత్రం మౌనమే సమాధానమవుతోంది.

* నంద్యాల ఉప ఎన్నిక గుణపాఠం..
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. నంద్యాల అంటేనే వైసీపీకి వెన్నుదన్నుగా ఉండే ప్రాంతం. ఒక విధంగా చెప్పాలంటే 2014లో రాయలసీమలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్నది కూడా వైసిపి. దాదాపు ఎవరికీ ఆశలు లేవు. అక్కడ ఖచ్చితంగా వైసిపి గెలుస్తుందని ఎక్కువమంది అంచనా వేశారు. కానీ నాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు చంద్రబాబు. ప్రత్యేక వ్యూహంతో నంద్యాల ఉప ఎన్నికను ఎదుర్కొన్నారు. అధికార బలంతో సర్వశక్తులు ఒడ్డారు. అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. కేవలం అధికారమనే వస్త్రాన్ని ప్రయోగించి..నాడు నంద్యాల నియోజకవర్గాన్ని కైవసం చేసుకోగలిగారు చంద్రబాబు.

* చాలా రిస్క్..
రెండు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో వైసిపి కి దారుణ పరాజయం ఎదురయింది. 175 నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితం అయింది. కడప జిల్లాలో చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా స్వల్ప విజయాన్ని అందుకుంది వైసిపి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీతో ఎంపీగా.. అవినాష్ రెడ్డి విజయం సాధించారు. కేవలం 60 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందగలిగారు. అటు పులివెందులలో జగన్ మెజారిటీ సైతం గణనీయంగా తగ్గింది. ఇటువంటి సమయంలో ఉప ఎన్నిక అంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన్నుకు పోతుంది. ఈ విషయం జగన్ కు తెలియంది కాదు. అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల ఎమ్మెల్యే పదవిని వదులుకోరని, ఎంపీగా పోటీ చేసే సాహసం చేయరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇడుపులపాయలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద రాజీనామా, ఎంపీగా పోటీ వంటి అంశాలను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకపోవడంతో.. అది ఊహాగానంగా తేలిపోయింది.