https://oktelugu.com/

PM JAY: కుటుంబానికి రూ. 10 లక్షలు.. పేదలకు భారీ శుభవార్త చెప్పిన కేంద్రం…

PM JAY: కేంద్ర ప్రభుత్వం మూడేళ్ళలో ఈ అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసే పనిలో ఉంది.గతంలో 70 ఏళ్ళు దాటిన వారికీ ఈ పథకం లభించేది కాదు.కానీ ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తుంది.అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశం లో ఇలాంటి వారు అయిదు కోట్లు ఉన్నారని సమాచారం.

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2024 / 02:11 PM IST

    PM JAY

    Follow us on

    New Delhi: ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికలలో తగినంత మెజార్టీ రాకపోవడం తో బీజేపీ అలర్ట్ అయ్యినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే పేద ప్రజల సపోర్ట్ ను పొందేందుకు సంక్షేమ పథకాల లబ్ది ని పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత్(PM JAY ) లబ్ధిని కేంద్రం డబుల్ చేయనుంది.

    గతం లో ఈ ఆరోగ్య భీమా పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షలు భీమా ఉండేది.అయితే ప్రస్తుతం దీనిని డబుల్ చేస్తూ రూ.10 లక్షలకు పెంచబోతున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు.ఈ పథకం కింద అప్లై చేసే లబ్ధిదారుల సంఖ్యను కూడా డబుల్ చేయనున్నట్లు సమాచారం.

    కేంద్ర ప్రభుత్వం మూడేళ్ళలో ఈ అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసే పనిలో ఉంది.గతంలో 70 ఏళ్ళు దాటిన వారికీ ఈ పథకం లభించేది కాదు.కానీ ఇప్పుడు 70 ఏళ్ళు దాటిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తుంది.అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశం లో ఇలాంటి వారు అయిదు కోట్లు ఉన్నారని సమాచారం.రాష్ట్రపతి ద్రౌపది ఇటీవలే పార్లమెంట్ ప్రసంగంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

    ఈ పథకంతో కేంద్రం పై ప్రతి సంవత్సరం రూ.12 ,076 కోట్లు అదనపు భారం పడనుంది.ఈ పథకం పొందడం కోసం ఆయుష్మాన్ కార్డును అప్లై చేసుకోవాలి.ఈ కార్డు అచ్చం ఆధార్ కార్డు లాగానే ఉంటుంది.ఇక ఈ కార్డు ఉన్న కుటుంబం సంవత్సర కాలం లో రూ.5 లక్షలు ఒకవేళ పెంచినట్లయితే రూ.10 లక్షలు ఉచిత వైద్యం పొందవచ్చు.ఏ ఏ ఆసుపత్రిలో ఈ పథకం అమలులో ఉందో ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్ సైట్ (https://hospitals.pmjay.gov.in/Search/empnlWorkFlow.htm?actionFlag=ViewRegisteredHosptlsNew) లో చూసి తెలుసుకోవచ్చు.