https://oktelugu.com/

YS Jagan : జగన్ కోసం ఆ సామాజిక వర్గం యువత బలి!

రాజకీయాల్లో కులం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. తమ కులం వాడు రాజ్యాధికారం దక్కించుకుంటే ఎంతో సంబరపడిపోతారు. తమకు ప్రయోజనం లేకపోయినా.. తాము అభిమానించే నేత ప్రయోజనం కోసం పరితపిస్తారు. ఇప్పుడు ఏపీలో జరిగింది అదే. కులం పేరుతో వైసీపీకి దగ్గర అయిన యువత ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 10, 2024 10:52 am
    YS Jagan

    YS Jagan

    Follow us on

    YS Jagan :  తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక చరిత్ర ఉంది. సుదీర్ఘ నేపథ్యం కూడా ఉంది. అటువంటి సామాజిక వర్గాన్ని తన రాజకీయం కోసం వాడుకున్నారు జగన్. ఆ సామాజిక వర్గం యువతలో ఒక రకమైన కుల మత్తు నింపేశారు. ఇతర కులాల పై వ్యతిరేకత పెంచారు.వారిని తన బందీలుగా మార్చుకున్నారు. తనకోసం, తన పార్టీ కోసం పనిచేసే నిర్బంధ సైనికుల్లా మార్చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ అయిన సోషల్ మీడియా ప్రతినిధుల్లో.. రెడ్డి సామాజిక వర్గం వారే అధికం. వారి కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతం.వారి జీవితం కంటే వైసీపీ కోసం,జగన్ కోసం వారు నియమ నిబంధనలను అధిగమించారు. ప్రత్యర్థి కుటుంబాల్లో ఆడవాళ్లను సైతం బయటకు లాగారు. ఇప్పుడు వారే బాధితులుగా మిగిలారు. పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు.వారి కుటుంబాలకు బాధను మిగుల్చుతున్నారు. ఇప్పుడు వారికి అసలు తత్వం బోధపడుతోంది. తమ పిల్లలు దిద్దుబాటుకు కూడా అవకాశం లేకుండా తప్పులు చేశారని భావిస్తున్నారు. ఓ నటి అయితే నా తప్పులకు క్షమించండి.. నాకు భవిష్యత్తు అంటూ కనిపించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేయడం.. పరిస్థితి చేయి దాటిందని అర్థమవుతోంది.

    * సామాజిక వర్గానికి గౌరవం
    తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ రెడ్డి సామాజిక వర్గం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. ఆ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది చరిత్రకారులు ఉన్నారు. రాజకీయాల్లో రాణించిన వారు ఉన్నారు. జాతీయస్థాయి రాజకీయాలను శాసించిన వారు ఉన్నారు. కానీ జగన్ చర్యలు పుణ్యమా అని ఆ సామాజిక వర్గంపై ఇతరులు అనుమానంతో చూసేలా మార్చేశారు. దీంతో వారికి భవిష్యత్తు అంటూ లేకుండా పోయింది. తనకోసం, తన రాజకీయం కోసం, తాను అధికారంలో ఉండడం కోసం వారిని సమాజం పై వదిలారు జగన్. తనకున్న సైకో గుణాన్ని వారికి అంటగట్టారు. దానికి వారు మూల్యం చెల్లించుకుంటున్నారు.

    * శృతి మించిన సోషల్ మీడియా
    ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాను పెంచి పోషిస్తోంది. వైసిపి కూడా అలానే చేసింది. కానీ అది కాస్త శృతి మించింది. వర్రా రాజేందర్ రెడ్డి అనే వైసీపీ యాక్టివిస్ట్ పెట్టిన పోస్టులు చూస్తే అత్యంత జుగుప్సాకరంగా ఉంటాయి. ప్రత్యర్థులను తూలనాడేలా ఉంటాయి. సామాన్యులకు సైతం బాధ కలిగించేలా ఉంటాయి. అయితే ప్రత్యర్థి పై వ్యతిరేకత పెంచడానికి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం తప్పు. దానికి మూల్యం చెల్లించుకుంది వైసిపి. సామాన్యుడు సైతంతిరస్కరించేలా ప్రవర్తన మారింది. ఇప్పుడు అదే సోషల్ మీడియా ప్రతినిధులు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సోషల్ మీడియా అంటే అందులో రెడ్డి సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ పాలనలో వారికి ఒరిగిందేమీ లేదు. ఎందులోనూ రిజర్వేషన్లు లేవు. సంక్షేమ పథకాలు కూడా వారికి అందలేదు. ప్రత్యేక అభివృద్ధి పనులు కూడా వారికి అప్పగించలేదు. ఎలా చూసినా వారికి అన్యాయమే జరిగింది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టులు కూడా వారే ఎక్కువగా కనిపిస్తుండడంతో.. ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన నిర్వేదం ప్రారంభం అయ్యింది.