YS Jagan on Fake Liquor Racket: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నకిలీ మద్యం పై చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని జగన్ ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బెంగళూరు వచ్చిన ఆయన దీపావళి వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఈరోజు తాడేపల్లి కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన విదేశాలకు వెళ్లిన సమయంలో నకిలీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దాని పైనే మాట్లాడారు జగన్. అయితే ప్రభుత్వమే నకిలీ మద్యం తయారు చేయించి వైసిపి నేతలపై ఆరోపణలు చేయిస్తుందని చెప్పుకొచ్చారు జగన్. ఇబ్రహీంపట్నం డంపు విషయంలో సైతం 2700 వరకు మద్యం సీసాల విషయం చెప్పారే కానీ.. మాజీ మంత్రి జోగి రమేష్ గురించి కానీ.. ఆయనపై ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు చేసిన ఆరోపణలు గురించి కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం.
నాడు నాసిరకం మద్యం
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మద్యం వ్యవహారంపై వచ్చిన ఆరోపణలతోనే. అప్పట్లో మద్యం అధిక ధరకు అమ్మారు. దేశంలో ఎక్కడా చూడని.. వినని బ్రాండ్లను విక్రయించారు. ఆ మద్యం తాగి వేలమంది అనారోగ్యానికి గురయ్యారని.. మరణాలు సైతం సంభవించాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కానీ ఒక్క రోజంటే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) దానిపై మాట్లాడిన దాఖలాలు లేవు. అప్పట్లో జే బ్రాండ్ మద్యం అంటూ విపక్షాలు ఆరోపణలు చేసినా దానిపై క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నకిలీ మద్యం, నేరాలు ఘోరాలు అంటూ మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.
వారిద్దరి పేర్లు ప్రస్తావించకుండానే..
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో( Thamballapalli) నకిలీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. అప్పుడు పట్టుకున్నది ప్రభుత్వం నేతృత్వంలోని ఎక్సైజ్ శాఖ. సాక్షాత్తు టిడిపి ఇన్చార్జ్ పేరు బయటకు రావడంతో ఆ పార్టీ హై కమాండ్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. సదరు నేతను పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం డంపును సాక్షి మీడియాతో బయటకు చూపించారు. అది మొదలు దానిని రాజకీయంగా వాడుకోవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ విదేశాల నుంచి వచ్చిన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. నకిలీ మద్యం తయారీ వెనుక జోగి రమేష్ ప్రోత్సాహం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో ఇబ్రహీంపట్నంలోనే ఈ నకిలీ మద్యం తయారు చేశామని.. ఇప్పుడు కూడా అక్కడ తయారు చేద్దాం అనుకుంటే… ఇక్కడ కాదు తంబళ్లపల్లెలో అయితే బాగుంటుందని మాజీ మంత్రి జోగి రమేష్ సూచించారని.. అక్కడ నకిలీ మద్యం ఎక్సైజ్ శాఖకు పట్టించి చంద్రబాబుతో పాటు లోకేష్ కు చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అయితే తనకు అద్దేపల్లి జనార్దన్ రావుతో ఎటువంటి సంబంధం లేదని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. కానీ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవేవీ ప్రస్తావించలేదు. ఇబ్రహీంపట్నం అని చెప్పి.. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కానీ.. అద్దేపల్లి జనార్దన్ రావు పేరు కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. తొలుత నకిలీ మద్యంపై పెద్ద సౌండ్ తో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తర్వాత సైలెంట్ అయ్యారు. ఈరోజు కూడా జగన్ పొడి పొడిగానే మాట్లాడడం విశేషం.
ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేశ్ కు మాత్రమే సాధ్యం : జగన్
విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపడింది
పరవాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు బయటపడ్డాయి
పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు నకిలీ… pic.twitter.com/KI46NydE43
— BIG TV Breaking News (@bigtvtelugu) October 23, 2025