Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan plan against TDP in 2025: మారిన జగన్ వ్యూహం!

YS Jagan plan against TDP in 2025: మారిన జగన్ వ్యూహం!

YS Jagan plan against TDP in 2025: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ శ్రేణులతో ఇటీవల సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తాను సైతం ప్రజల్లోకి వస్తానని.. ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయింది చెబుతానని.. మీరు కూడా చెప్పాలని సూచిస్తున్నారు. అయితే ఓన్లీ చంద్రబాబును మాత్రమే జగన్ టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ మాత్రమే ప్రజలను మోసం చేసిందని చెబుతున్నారు. ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం లేదు. ఆయన పేరును కూడా సంబోధించడం లేదు. దీంతో పవన్ విషయంలో జగన్ వ్యూహం మార్చినట్టు స్పష్టం అవుతుంది. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Raghurama Krishnam Raju: మమ్మల్ని పట్టించుకోరా.. మళ్లీ రెచ్చిపోయిన రఘురామ.. వైరల్ వీడియో

ఆ రెండు పార్టీలు ప్రేక్షక పాత్ర..
ప్రస్తుతం తెలుగుదేశం( Telugu Desam) పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాయి. జనసేనతో పాటు బిజెపి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి దీనిని గుర్తించి వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. టిడిపి తో పాటు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తే మిగతా రెండు రాజకీయ పార్టీలు పూర్తిగా డిఫెన్స్ లో పడతాయని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. మేనిఫెస్టో విషయంలో తమకు సంబంధం లేదన్నట్టు బిజెపి వ్యవహరించింది. అందుకే ఆ పార్టీని పట్టించుకోవడం అనవసరం అన్న రీతిలో జగన్ ఉన్నారు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆ పార్టీ జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని భావిస్తున్నారు.

Also Read: Duvvada Srinivas Madhuri Wedding: దువ్వాడ.. ఇంత ఓపెన్ గా ఈ పనులేంటయ్యా.. వైరల్ వీడియో

ఒక్క చంద్రబాబు టార్గెట్..
అయితే సూపర్ సిక్స్( super six ) హామీలతో పాటు కూటమి మేనిఫెస్టో బాధ్యత తమదేనని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ ఏడాది పాలనలో అమలు చేయకపోవడాన్ని లోపంగా గుర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడే వ్యూహం మార్చారు. కేవలం చంద్రబాబు సర్కార్ ప్రజలను మోసం చేసిందని విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలను మరిచి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. ఆ డ్యామేజ్ ను గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం చంద్రబాబుపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. అటు పవన్ సైతం సైలెంట్ గా ఉన్నారు. జన సైనికులు సైతం ఎక్కువగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం చంద్రబాబును టార్గెట్ చేసుకుంటే జనసేన శ్రేణులు సైడ్ అవుతాయని.. ప్రజల్లోకి కూటమి వైఫల్యాలను తీసుకుని వెళ్ళగలమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి.. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. మరి అవి ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular