Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy : పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. జగన్...

YS Jagan Mohan Reddy : పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ.. జగన్ కామెంట్స్ వైరల్

YS Jagan Mohan Reddy  :  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజున, మాజీ సీఎం జగన్(Ex CM Jagan) ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేస్తూ, నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ అవ్వడం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి ‘భారత రాజ్యాంగం ప్రకారం నీకు ప్రతిపక్ష హోదా రాదు, ఈ 5 ఏళ్ళు దాని గురించి మర్చిపోండి. మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ కి వెళ్ళండి’ అంటూ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన దృష్టికి పవన్ కళ్యాణ్(Dy cm Pawan Kalyan) చేసిన కామెంట్స్ ని విలేఖరులు తీసుకొచ్చారు. దీనిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ లో ప్రకంపనలు పుట్టేలా చేసాయి. సోషల్ మీడియా అంతటా ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.

Also Read : నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!

ఆయన సమాధానం ఇస్తూ ‘పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ..ఎమ్మెల్యే కి తక్కువ..జీవితం లో మొట్టమొదటిసారి మొన్న ఎమ్మెల్యే అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. జగన్ చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ పరువు తీసేలా ఉన్నాయి. సోషల్ మీడియా లో అనేక మంది ఈ కామెంట్స్ ని షేర్ చేసి నవ్వుకుంటున్నారు. పొత్తు లేకుండా ఒంటరిగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడు అనే విషయం వాస్తవమే కదా, దీనికి జనసైనికులు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ కూడా అందుకే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు విమర్శించడని, అసలు పవన్ కళ్యాణ్ ఆయన దృష్టిలో రాజకీయ నాయకుడే కాదని, అందుకే అతని పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. జనసేన నాయకులూ కూడా జగన్ కామెంట్స్ కి ధీటుగా సమాధానం ఇవ్వడం లో విఫలం అవుతున్నారు.

Also Read : వైసీపీకి షాక్.. ఆ ఇద్దరు సీనియర్లు పార్టీకి దూరమైనట్టే!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...

YSR Congress: పార్టీకి డ్యామేజ్.. వైసీపీ సీనియర్ల ఆవేదన అదే!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న...

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
Oktelugu Epaper
Exit mobile version