North Andhra Teachers MLC : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress). అక్కడ కూటమి మద్దతు ఇచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఓడిపోయారు. పి ఆర్ టి యు తరఫున బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అయితే ఇది కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కానీ తాను మద్దతిచ్చిన అభ్యర్థి మూడో స్థానంలో ఉన్న విషయాన్ని మరిచిపోతోంది. అదే విషయంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. టిడిపి కూటమి అభ్యర్థి అంటూ లేనిపోని హడావిడి చేస్తోంది.
Also Read : నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!
* అభ్యర్థిని ప్రకటించని టిడిపి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ( North Andhra teachers MLC ) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేరుగా అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకల పార్టీ రఘువర్మకు మాత్రం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే అప్పటికే కూటమికి చెందిన చాలామంది నేతలు గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతుగా నిలిచారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ లాంటివారు నేరుగా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే అదే సమయంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాత్రంరఘువర్మ గెలుపు కోసం కూటమి నేతలు కృషి చేయాలని పిలుపునివ్వడం విశేషం. అయితే అప్పటికే బిజెపి నేత మాధవ్ శ్రీనివాసుల నాయుడు నామినేషన్ లో సైతం పాల్గొన్నారు. ఒకటి రెండు సభల్లో సైతం హాజరయ్యారు.
* సీఎం టెలి కాన్ఫరెన్స్
మరోవైపు సీఎం చంద్రబాబు( CM Chandrababu) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. యుటిఎఫ్ తరఫున బరిలో నిలిచిన విజయ గౌరీ కి మద్దతు ప్రకటించింది. అయితే ఈ తరుణంలో సీఎం చంద్రబాబు రఘువర్మతో పాటు గాదె శ్రీనివాసుల నాయుడుకు కూడా గెలిపించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చినట్లు ప్రచారం జరిగింది. అంటే కూటమిలో ఎక్కడో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. కానీ ఇప్పుడు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఓడిపోయేసరికి అది కూటమి ఖాతాలో వేసే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* మూడో స్థానంలో వైసిపి మద్దతు అభ్యర్థి
వాస్తవానికి యూటీఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ కి( Vijaya Gowri) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కానీ ఆమె మూడో స్థానానికి పరిమితం అయ్యారు. రఘువర్మ రెండో స్థానంలో ఉన్నారు. శ్రీనివాసులు నాయుడు విజేతగా నిలిచారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. ఏ పార్టీతోను శత్రుత్వం లేదని.. తనను ఉపాధ్యాయులు గెలిపించాలని చెప్పుకొచ్చారు శ్రీనివాసుల నాయుడు. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థి మూడో స్థానంలో నిలిచిన విషయాన్ని కూడా మర్చిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టిడిపి ఘన విజయం సాధించిన విషయాన్ని కూడా మరిచిపోయినట్టుంది. అందుకే ఉత్తరాంధ్రలో కూటమికి షాక్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
Also Read : గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. నిజం ఎంత?