spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Family Property Dispute: జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవ.. విజయ సాయి రెడ్డికి...

YS Jagan Family Property Dispute: జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవ.. విజయ సాయి రెడ్డికి మిగిలింది ఇదీ

YS Jagan Family Property Dispute: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవ జరుగుతోంది. జగన్ సోదరి షర్మిల.. తల్లి విజయలక్ష్మి ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆస్తుల పంపకంలో జగన్ సమతూకాన్ని పాటించడం లేదని షర్మిల ఆరోపించింది. విజయలక్ష్మి కూడా అదే స్థాయిలో విమర్శలు చేసింది. ఆమె తన న్యాయవాది ద్వారా ఒక లేఖను కూడా మీడియాకు విడుదల చేసింది.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవ జరుగుతుండగానే.. ఒక కీలక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అంతకుముందు రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు అండగా నిలిచిన విజయసాయిరెడ్డి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీలో కొంత కాలం పాటు విజయసాయిరెడ్డి ఆ నంబర్ 2 గా వ్యవహరించారు.. ఆయన పార్టీ కార్యకలాపాలలో.. ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. విజయసాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. ఇక అప్పటినుంచి విజయసాయిరెడ్డి జగన్ కు దూరమయ్యారు.

గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయ సాయి రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పటికీ.. ఓటమి పాలయ్యారు. ఇక అప్పటినుంచి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి మరింత దూరమయ్యారు. ఈ క్రమంలోనే కీలకమైన విషయాలను ఆయన బయటపెట్టారు. మద్యం కుంభకోణం.. అంతకుముందు జరిగిన అనేక వ్యవహారాలను ఆయన బయటికి వెల్లడించారు. విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనను మోసిన సాక్షి.. ఆ తర్వాత విమర్శించడం మొదలు పెట్టింది.. విజయసాయిరెడ్డిలో తెలియని కోణాలను బయటపెట్టింది.

ఇప్పుడు జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవ జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తెరపైకి వచ్చారు. కాకపోతే ఆయన ఒక రైతుగా మారిపోయారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయం చేస్తానని చెప్పిన విజయసాయిరెడ్డి.. చెప్పినట్టుగానే అదే పని చేస్తున్నారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో జీవామృతం.. ఇతర ఆర్గానిక్ ఉత్పత్తులను తయారు చేస్తూ.. పంటలపై వాటిని స్ప్రే చేస్తున్నారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆస్తుల గొడవ జరుగుతుంటే.. విజయసాయి రెడ్డి ప్రకృతితో మమేకమవుతున్నారని.. ఒత్తిడికి దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్ ఆస్తులు వ్యవహారాలను మొత్తం చూసిన విజయసాయిరెడ్డికి చివరికి ఇది మిగిలిందని కామెంట్ వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper