Janasena-TDP: జనసేనపై ఎల్లో మీడియా కుట్ర ఇది

ముఖ్యంగా జనసేన విషయంలో ఎల్లో మీడియా సరికొత్త ప్రచారం చేస్తోంది. జనసేనకు తక్కువ సీట్లు కట్టబెడుతూ ప్రత్యేక కథనాలు రాస్తుంది. తొలుత 18 అసెంబ్లీ స్థానాలు అని.. తరువాత 22 నుంచి 28 అని.. అటు తరువాత 32 అంటూ ఏవేవో కథనాలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

Written By: Dharma, Updated On : February 8, 2024 12:38 pm
Follow us on

Janasena-TDP: టిడిపితో జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇప్పుడు బిజెపి కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాల్సి ఉంటుంది. దాదాపు ఆ రెండు పార్టీలకు 40 అసెంబ్లీ స్థానాలు, పది పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఆ స్థాయిలో సర్దుబాటు చేయాల్సి ఉండడంతో.. టిడిపి నేతలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొందరు నాయకులు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంది. అందుకే చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబుకు మించి ఎల్లో మీడియా చాలా రకాలుగా ఆలోచిస్తోంది. పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు ఇచ్చే సీట్ల విషయంలో అంకెల గారడీ చేస్తోంది.

ముఖ్యంగా జనసేన విషయంలో ఎల్లో మీడియా సరికొత్త ప్రచారం చేస్తోంది. జనసేనకు తక్కువ సీట్లు కట్టబెడుతూ ప్రత్యేక కథనాలు రాస్తుంది. తొలుత 18 అసెంబ్లీ స్థానాలు అని.. తరువాత 22 నుంచి 28 అని.. అటు తరువాత 32 అంటూ ఏవేవో కథనాలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈ తరహా ప్రచారానికి తెరలేపింది.దీనిపై జనసేన అగ్రనేతల్లో ఒకరైన నాగబాబు సైతం స్పందించారు. అటువంటి ప్రచారాన్ని ఖండించారు. జనసేన శ్రేణులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యలాంటివి. ఆ పార్టీకి ఇప్పుడు పొత్తులు కీలకం. అలాగని పొత్తులో సింహభాగం ప్రయోజనం పొందాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. వీలైనంతవరకు తక్కువ సీట్లను జనసేనతో పాటు బిజెపికి కట్టబెట్టాలని చూస్తోంది. ఆ బాధ్యతను ఎల్లో మీడియా చూస్తోంది. ముఖ్యంగా జనసేన విషయంలో లేనిపోని ప్రచారానికి దిగుతోంది. తక్కువ సీట్లు కట్టబెట్టడంతో పాటు జనసేన బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. జనసేనకు 50కు మించి స్థానాలు ఇవ్వాలన్నది కాపు సామాజిక వర్గం వారి ఆకాంక్ష. అప్పుడే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందని.. జనసేనకు కమ్మ.. టిడిపికి కాపు ఓటు బ్యాంకు బదలాయింపు జరిగే అవకాశం ఉంది. కానీ ఇది పట్టని ఎల్లో మీడియా జనసేన చుట్టూ విష ప్రచారానికి దిగుతోంది. సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకు తగ్గించాలని చూస్తోంది.