YCP: జాతీయ స్థాయిలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ ప్రభావం తగ్గుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే గెలిచారు ఆ పార్టీ నుంచి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అయితే రాష్ట్రంలో శాసనమండలిలో, కేంద్రంలో రాజ్యసభలో ఆ పార్టీకి బలం ఉండేది. ఏపీలో అధికార పార్టీ కంటే ఎక్కువగా ఆ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఏపీ శాసనమండలిలో ఆ పార్టీ బలం 38. రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉండేవారు. అయితే రాజ్యసభలో టిడిపికి కనీస ప్రాతినిధ్యం లేకపోయేది. మండలిలో సైతం ఓ పదిమంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గిపోవడం విశేషం.
* మండలిలో తగ్గిన బలం..
శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. అయితే క్రమేపి ఆ సంఖ్య తగ్గుతోంది. ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కూటమి పార్టీలో చేరారు. అయితే మండలి చైర్మన్ గా ఉన్న మోసేన్ రాజు వారి రాజీనామాలను ఆమోదించలేదు. పెండింగ్ లో పెట్టారు. లేకుంటే ఓ పదిమంది ఎమ్మెల్యేల సంఖ్య తగ్గేది. కూటమి పార్టీల ప్రాతినిధ్యం పెరిగేది. ఉపాధ్యాయులతో పాటు స్థానిక సంస్థల కు సంబంధించి ఎమ్మెల్సీలతో సమాన బలం వచ్చేది. అదే జరిగితే మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించేసేది టిడిపి. అందుకే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం చాటుతోంది.
* మిగిలింది నలుగురే..
మరోవైపు రాజ్యసభలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం నాలుగుకు పడిపోనుంది. 2024 ఎన్నికల ఫలితాలు నాటికి రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 11. కానీ ఆ పార్టీ నుంచి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య బయటకు వచ్చేసారు. రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైసిపి బలం 8 కి పడిపోయింది. మరోవైపు విజయసాయి రెడ్డి సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని వదులుకున్నారు. దీంతో వారి బలం ఏడుపు పడిపోయింది. మరోవైపు ఈ జూన్ నాటికి వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని పదవీ విరమణ చేస్తారు. వారితో పాటు టిడిపికి చెందిన సానా సతీష్ సైతం పదవీ విరమణ చేస్తారు. అయితే వైసీపీకి ఎప్పటి వరకు ఉన్న ఏడుగురు ఎంపీలు.. నలుగురు గా మిగలనన్నారు. దీంతో ఆ పార్టీ బలం పూర్తిగా తగ్గిపోయినట్టు అవుతుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీల తో పాటు కేంద్రంలో రాజ్యసభ సభ్యులు తగ్గడం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లోటు.