Mana Shankara Vara Prasad Garu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నప్పటికి అనిల్ రావిపూడి కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే స్థాయిలో ఉంటాయి. ఆయన ఏం చేసిన సరే సక్సెస్ మాత్రం సాధిస్తూ ఉంటారు. గత సంవత్సర సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు….
ఈ మూవీలో చిరంజీవి – నయనతార ఇద్దరు భార్య భర్తలుగా నటిస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీలో అనుకోకుండా చిన్న వివాదాలు రావడం వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని అనుకోవడంతో వెంకటేష్ వచ్చి వీళ్ళిద్దరిని ఎలా కలిపాడు అనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది…
ఈ సినిమా మొదటినుంచి చివరి వరకు ఆధ్యాంతం కామెడీతో సాగడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అవుతారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి – వెంకటేష్ కలిసి ఒక అమ్మాయికి లైన్ వేసే సీనైతే ఉంటుందట.
అది ఈ సినిమాలో చాలా కామెడీగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అలాగే ఒకప్పటి వింటేజ్ చిరంజీవి, వింటేజ్ వెంకటేష్ మనకు ఆ సిన్ లో కనిపిస్తారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతో పాటుగా వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి ఫైట్ కూడా ఉండబోతుందట. ఆ ఫైట్ ను ఎలా డిజైన్ చేశారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వెంకటేష్ – చిరంజీవి కలిసి చేస్తున్న ఈ రచ్చని చూడడానికి ప్రేక్షకులు మొత్తం సిద్ధంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూసి సూపర్ సక్సెస్ చేస్తారు కాబట్టి అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మరోసారి ఈ సినిమాని తీసుకొస్తున్నాడు. అనిల్ రావిపూడి ప్రధాన బలం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కావడం వల్ల అతను ఏం చేసినా కూడా వాళ్ళు ఆదరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుంది. ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…