Homeఆంధ్రప్రదేశ్‌YCP Party : కూటమి వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ.. ఇక్కడే రాంగ్ స్టెప్ వేసిందా?

YCP Party : కూటమి వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ.. ఇక్కడే రాంగ్ స్టెప్ వేసిందా?

YCP Party :  ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది. వైసీపీకి సీట్లు రాకపోయినా ఆ పార్టీ ఇంకా బలంగానే ఉంది.ఇంకా రాజకీయాలపై ప్రభావం చూపుతూనే ఉంది. ముఖ్యంగా ఆ పార్టీకి ఉన్న సోషల్ మీడియా సైన్యం పనిగట్టుకుని కూటమి ప్రభుత్వంపై ప్రచారం చేస్తోంది. వైసిపి హయాం మాదిరిగానే వారి హవా నడుస్తూ వస్తోంది. అదే సమయంలో పోలీస్ వ్యవస్థలో వైఫల్యాలు బయటపడుతున్నాయి. ఈ తరుణంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు పై ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అది మొదలు కూటమిలో చీలిక ప్రారంభమైందని ప్రచారం చేయడం ముమ్మరం చేశారు. అటు తరువాత ఇదే విషయంపై మంత్రివర్గ సమావేశంలో పవన్ మాట్లాడారు. సోషల్ మీడియా ప్రచారానికి తాను బాధితుడు లేనని.. తన పిల్లలు ఏడ్చారని గుర్తు చేశారు. దీంతో ఏపీ ప్రజల కోసం కాదా.. తన పిల్లలు ఏడ్చారని పవన్ ఇంతలా చేశారా అంటూ మళ్ళీ ప్రచారం మొదలు పెట్టింది వైసిపి సోషల్ మీడియా. అటు తరువాత హోంమంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ ను కలిశారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాకు అందరము బాధితులు అయ్యామని.. అందుకే అంత ఎమోషన్ అయ్యానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో మళ్లీ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషణలు చేయడం ప్రారంభించారు.

* ఆ వ్యూహంతోనే పవన్
అయితే డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాటజీ వైసీపీకి స్పష్టంగా తెలుసు. పవన్ నోటి నుంచి వచ్చే మాట పవర్ ఫుల్ గా ఉంటుంది. అదే పోలీసు వ్యవస్థతోపాటు హోం శాఖ పనితీరుపై పవన్ చంద్రబాబుకు ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు.ప్రజలకు వాస్తవాలు తెలియజేసే పనిలో భాగంగానే పవన్ దీనిపై బహిరంగంగా మాట్లాడారు. హోం శాఖ, పోలీస్ వ్యవస్థ, వైసీపీ సోషల్ మీడియా కీచకుల అంశం చర్చకు వచ్చేలా కారణం అయ్యారు. హోంమంత్రి పై పవన్ వ్యాఖ్యానిస్తే.. అదే హోం మంత్రి వంగలపూడి అనిత పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ వైసీపీ నేతలు నెగిటివ్ గా భావించి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పవన్ తమపై వ్యాఖ్యానిస్తున్నారని తెలిసి దానిని తిప్పికొట్టకుండా.. కూటమిలో విభేదాలు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

* ఎవరి పాత్రలో వారు
అయితే కూటమి వ్యూహంలో వైసీపీ చిక్కుకున్నట్లు అయ్యింది.కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. కానీ దీనిపై సీఎం చంద్రబాబు ఫీల్ కాలేదు. తన శాఖను అవమానించేలా మాట్లాడారని హోం శాఖ మంత్రి అనిత నొచ్చుకోలేదు. కేవలం వైసీపీ సోషల్ మీడియా ఆగడాలను బయటపెట్టేందుకు ఎవరి పాత్రలో వారు ఇమిడిపోయారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో హైలెట్ అయ్యింది వైసీపీ సోషల్ మీడియా అరాచకాలు. అయితే ఎవరికి వారు సంయమనంతో ఉండడం వల్లే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్, హోం మంత్రి అనిత కూడా ఎవరికి వారు వెనక్కి తగ్గారు. అదే సమయంలో చంద్రబాబు సైతం పవన్ కు ప్రాధాన్యం ఇచ్చారు. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. అందుకు వైసిపి కారణమనిప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ముమ్మాటికి ఎపిసోడ్లో మూల్యం చెల్లించుకుంది వైసిపి మాత్రమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular