YCP Party : దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్( IPL fever) నడుస్తోంది. అంతట క్రికెట్ సందడి నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా క్రికెట్ గురించి ప్రస్తావన వస్తోంది. ఇటువంటి తరుణంలో ఆర్సీబీ చేసిన ఒక ట్వీట్ ఏపీలో రాజకీయ వివాదానికి కారణమవుతోంది. ‘ 11 పరుగులు కావాలి, 11 బంతుల్లో, 11:11 గంటలకు’ అని ఆర్సిబి చేసిన ట్వీట్ పై వైయస్సార్ కాంగ్రెస్ అభిమాని ఒకరు తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆర్ సి బి తమను టార్గెట్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. దేశంలో జరుగుతున్న సమకాలీన అంశాలను.. ఏపీ రాజకీయాలకు సరిపోలుస్తూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడుస్తోంది.
Also Read : దసరాకు విజయసాయిరెడ్డి ఛానల్.. ఏ పేరు పెట్టారో తెలుసా?
* ఆర్సిబి గెలవాలని
క్రికెట్ ఫాన్స్ కు( cricket fans ) పండుగ. దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. అన్ని టీం లకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆర్సిబి ప్రధాన జట్టుగా బరిలో ఉంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ టీంకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ రాలేదు. ఈసారి తప్పకుండా వస్తుందని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఆర్సిబి ఆఫీసియల్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ అభిమాని ఈగో హార్ట్ చేసింది. ఆర్సిబి ఇచ్చిన కౌంటర్ ట్వీట్ వైరల్ అవుతోంది. అసలు ఆర్సిబి ట్వీట్ కు వైయస్సార్సీపి ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే..
* సరదాగా పెట్టిన ట్వీట్..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం( Royal Challengers Bangalore team ) అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో..’ 11 runs required in 11 balls at 11: 11′ అంటూ ట్విట్ చేసింది. ఆ వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఈ ట్వీట్ పై స్పందించారు.’ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. కొడకల్లారా.. కొట్టారు తీసుకున్నాం.. మా టైం వస్తుంది. మీరు ఎంత ఎగిరినా 2029 లో టికెట్ హైక్స్ కోసం మా జగనన్న కాళ్లు పట్టుకోవాల్సిందే.. # boy cutRCB’ అంటూ ఘాటుగా స్పందించారు. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు రావడంతో.. దానిని ఉద్దేశించి ప్రస్తావించారని అర్థం వచ్చేలా ఆ పార్టీ అభిమాని స్పందించారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మాత్రం నాలుగు చోట్ల 11 అనే అంకె రావడంతో సరదాగా ట్వీట్ చేసిందనే వాదన వినిపిస్తోంది. అయితే గతంలో ఇదే అభిమాని ఇలానే స్పందించిన సందర్భాలు ఉన్నాయి.