YCP Leaders: వైసీపీ నేతలు భయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలు నడిపారు. ఇప్పుడు అధికారం దూరమైంది. వ్యవహారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వాటిని కప్పుకోలేక.. తిరగలేక ఎక్కువ మంది సతమతమవుతున్నారు. కొంతమంది సైలెంట్ అవుతున్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొందరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త తన భార్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించేసరికి వివాదం ప్రారంభమైంది. అటు తిరిగి ఇటు తిరిగి విజయసాయిరెడ్డి పై ఆ వివాదం పడింది. శాంతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు విజయసాయి రెడ్డి తండ్రి అని అర్థం వచ్చేలా ఆమె భర్త మాట్లాడారు. నేరుగా ఆరోపణలు కూడా చేశారు. దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ కి సిద్ధం కావాలని సవాల్ చేశారు. కానీ తనకు ఏమి తెలియదని.. ఇదంతా కొంతమంది మీడియా అధినేతలు చేసిన కుట్ర అని.. అరేయ్ తురేయ్ అంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన విజయసాయిరెడ్డి తర్వాత కనుమరుగయ్యారు. కనీసం ఏపీలో కనిపించడం లేదు. అడపాదడపా ఢిల్లీలో పెద్దవాళ్లతో కనిపిస్తూ కాలం గడిపేస్తున్నారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం బయటికి వచ్చింది. దానిపై నేడు దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది.మహిళతో వివాహేతర సంబంధానికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో హాట్ టాపిక్ గా మారింది.
* వికటించిన ప్రయోగం
కింజరాపు కుటుంబం పై దువ్వాడ శ్రీనివాసును ప్రయోగించారు జగన్. కింజరాపు వారి స్వగ్రామం నిమ్మాడ వెళ్లి సవాల్ చేశారు దువ్వాడ. కనీసం దువ్వాడ వ్యక్తిగత జీవితాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు జగన్. 2014 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. జిల్లాలో సీనియర్ మంత్రులు ఉన్నా… వారిని కాదని దువ్వాడకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు జగన్. అటువంటి దువ్వాడ పైన ఇప్పుడు వివాహేతర సంబంధ ఆరోపణలు వచ్చాయి. ఇది టిడిపి నేతల కుట్ర అని చెప్పేందుకు వీలు లేదు. కచ్చితంగా దీనిపై దువ్వాడతో పాటు జగన్ స్పందించాల్సిందే.
* త్వరలో వీడియోలు
మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. ఇప్పటివరకు ఆయన ఆడియోలే విడుదలయ్యాయి. మరో వారం రోజుల్లో ఆయన వ్యక్తిగత వ్యవహార శైలికి సంబంధించి.. వీడియోలు సైతం వస్తాయని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొంతమంది టిడిపి నేతలు అంతర్గత చర్చల్లోచెప్పుకుంటున్నారు. అయితే ఈ వివాదాలు గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వచ్చాయి. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి బయట పడుతున్నాయి.
* నాడు పట్టించుకుని ఉంటే
వ్యక్తిగత వివాదాలతో చాలామంది వైసిపి నేతలు సతమతమవుతున్నారు. ఇటువంటి నేతల విషయంలో జగన్ సైతం పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం పట్టించుకోలేదు కూడా. ఓ ఎంపీ న్యూడ్ వీడియోతో అడ్డంగా పట్టుబడినా ఆయనపై చర్యలు లేవు. గంట అరగంట అంటూ మహిళలతో మంత్రులు అసభ్యంగా మాట్లాడినా వారిపై కూడా ఎటువంటి చర్యలు లేవు. నాడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇది ముమ్మాటికి జగన్ స్వయంకృతాపమే.