AI Technology Government Schools: ఒకప్పుడు మత్తు మహమ్మారి అనేది కేవలం మహానగరాలకు మాత్రమే పరిమితమయ్యేది. కాలానుక్రమంగా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించింది. ఒకప్పుడు పెద్దపెద్ద కళాశాలలో చదువుకునే వారికి మాత్రమే మాదకద్రవ్యాలు అంతంతమాత్రంగా అందేవి. ఇప్పుడు ఏకంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా లింగంతో సంబంధం లేకుండా, వయసు తరగని లేకుండా చాలామంది మత్తు పదార్థాలకు సులువుగా అలవాటు పడుతున్నారు. ఆ తర్వాత బానిసలవుతున్నారు. ఇక గతంలో మాదకద్రవ్యాల కేసు కు సంబంధించిన దర్యాప్తులో అబ్కారీ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు.. అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దర్యాప్తులో అధికారులు పలు పాఠశాలల్లో సోదాలు చేయగా.. విద్యార్థులు నిషేధిత మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇక తాజాగా తెలంగాణ ఇలాంటి నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ల్యాబ్) తనిఖీల్లో ఇదే విషయం తెరపైకి వచ్చింది.
షాద్ నగర్ ప్రాంతంలో..
హైదరాబాద్కు దగ్గరలోని శాద్ నగర్ ప్రాంతంలో ఓ పాఠశాల చెందిన విద్యార్థులు గంజాయి చాక్లెట్లకు బానిసలు అయ్యారు. ఆ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, వాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు ఐటీ, టీజీ న్యాబ్ సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దానికి మిత్ర అనే పేరు పెట్టాయి. ఐటీ శాఖ తీసుకొస్తున్న ఈ విధానానికి సంబంధించి అనేక కంపెనీలు పోటీ పడినప్పటికీ.. యునైటెడ్ ఈ – కేర్ కంపెనీతో అధికారులు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలోని 20 స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ మిత్ర యాప్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ విధానాన్ని అతి త్వరలో రాష్ట్ర మొత్తం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.. ఐటీ, టీజీ న్యాబ్ సంస్థలు తెలంగాణ విద్యాశాఖ తో ఒప్పందం కుదుర్చుకొని పని చేయనున్నాయి.
ఎలా పనిచేస్తుందంటే
మిత్ర యాప్.. దీనిని మన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దీనిని వాట్సాప్ కు అనుసంధానం చేస్తారు. దానిద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు 13 ప్రశ్నలు పంపిస్తారు..”మీ అమ్మాయి లేదా అబ్బాయి గదిలో ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నారా? వారిలో ఏమైనా మగత లక్షణాలు కనిపిస్తున్నాయా? వారు చిన్న విషయానికి ఆగ్రహానికి గురవుతున్నారా? వారి ప్రవర్తనలో ఏమైనా అనూహ్య మార్పు కనిపిస్తోందా? ఈ తరహా ప్రశ్నలు అధికారులు సంధిస్తారు. ఆ ప్రశ్నలకు తల్లిదండ్రులు ఇచ్చే సమాధానంల ఆధారంగా పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలయ్యారా? లేదా? అనేది వారు తేలుస్తారు.
పిల్లలు మత్తుకు బానిసలు అయితే వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఆ విషయాలను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడరు. అయితే అలాంటి వారిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల నంబర్లు తీసుకొని మాట్లాడుతోంది. ఈ విషయాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. తల్లిదండ్రులు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటోంది. కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాకుండా పాఠశాలలు, కళాశాలల నిర్వాహకుల నుంచి కూడా ప్రభుత్వం పలు సమాధానాలను రాబడుతోంది. అక్కడ కూడా వివరాలను బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతోంది.