Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త ప్లాన్ వేశారా? కాకినాడ పోర్టు గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అందులో భాగంగానే పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారా? తన మాటలకు రెండు వైపులా పదును ఉంటుందని నిరూపించారా? పవన్ కళ్యాణ్ కు ప్రేమ సందేశం వెనుక ప్లాన్ ఏంటి? కూటమి విఛ్చి న్నానికి ప్రయత్నమా? లేకుంటే తనను తాను కాపాడుకోవడానికి శరణమా? అసలు విజయసాయిరెడ్డి మదిలో ఏముంది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీలో నెంబర్ టూ గా విజయసాయిరెడ్డిని అందరూ చెబుతారు. శుక్రవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ఏపీని పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందనేది దాని వెనుక్కున్న సారాంశం. విజయసాయిరెడ్డి కామెంట్స్ వెనుక ఇంటా బయట చర్చ జరిగింది. చర్చ జరుగుతోంది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన స్కెచ్ బాగానే వర్కౌట్ అయింది. కాకినాడ పోర్టు వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయారు ఆయన. ఆ కేసులో ఆయనను ఎటుగా చేర్చింది సిఐడి. దాని నుంచి బయటపడేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు విషయం తెలియగానే నేరుగా బిజెపి పెద్దలతో భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు కేసులో జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ కూడా చేశారట. అయితే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అని..ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నారని.. అందుకే తామేమి చేయలేమని చేతులెత్తేసారట. అప్పటినుంచి విజయసాయిరెడ్డి స్వరంలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి తన అస్త్రాలను విసిరారు విజయసాయిరెడ్డి.దీనిపై జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
* పొలిటికల్ క్రిమినల్ స్ట్రాటజీ
అయితే విజయసాయి రెడ్డి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో తెలియంది కాదు. గతంలో ఆయన గేమ్ తో టిడిపి మూల్యం చెల్లించుకుంది. 2014 నుంచి 19 సమయంలో ఎన్డీఏలో టిడిపి భాగస్వామి.ఆ సమయంలో చీటికిమాటికి విజయసాయిరెడ్డి ప్రధానిని కలిసేవారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. వైసిపి ఎన్డీఏలో చేరుతుందని ప్రచారం చేసేవారు. అటు విజయసాయిరెడ్డి తో కేంద్రపెద్దలు తరచూ కలవడాన్ని సహించుకోలేకపోయారు చంద్రబాబు. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానంతో ఎన్డీఏ నుంచి బయటపడ్డారు. అయితే ఇలా అనేదానికంటే విజయసాయి రెడ్డి స్కెచ్ లో భాగంగానే అది జరిగిందన్నది వాస్తవం. పొలిటికల్ క్రిమినల్ స్ట్రాటజీ చేయడంలో విజయసాయిరెడ్డి ఆరితేరిపోయారు.అందులో భాగంగానే ఆయన లేటెస్ట్ ట్వీట్ అని.. ఓటమి మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
* కొద్ది రోజుల కిందట వరకు
ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా విజయసాయిరెడ్డి పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబుకు దత్త పుత్రుడు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నారని..అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పవన్ కేవలం చంద్రబాబుకు ఉపయోగపడుతున్నారని.. ప్రజలకు ఏమాత్రం పనికిరారు అని తేల్చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అని పేరు పెట్టింది కూడా సాయి రెడ్డి. అయితే తనను తాను బయటపడేందుకు.. కూటమి మధ్య విభేదాలు తెచ్చేందుకు.. విజయసాయిరెడ్డి ఆడుతున్న గేమ్ పై జనసేన రియాక్ట్ కావడం లేదు. ఆయన చేస్తున్న ప్రయత్నం విఫలం అన్నది స్పష్టంగా తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp leader vijayasai reddy is showing immense admiration for pawan kalyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com