YCP Party : మరో దశాబ్ద కాలం పాటు ఏపీలో కూటమి కొనసాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం అదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు.కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అటు జనసేన, ఇటు టిడిపి శ్రేణులు మాత్రం అధినేతల మనసు ఎరగడం లేదు. రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతున్నారు. పొత్తు ధర్మానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. జనసైనికులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పవన్ సైతం ఈ పొత్తు రాష్ట్రం కోసమేనని..ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకు కాదని తేల్చి చెప్పారు కూడా. అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు తెలిసే ఆ ఇద్దరు అధినేతలు పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే కింది స్థాయిలో మాత్రం పార్టీల మధ్య రగడకు కొంతమంది నేతలు ఆజ్యం పోస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం లో రెండు పార్టీల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి ఓ టిడిపి నేత అతిగా వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ వేడికి కారణమైంది. జనసైనికులు బాహటంగానే నిరసన తెలిపారు.సంబంధిత టిడిపి నేతను కఠినంగా శిక్షించడమే కాదు పార్టీ నుంచిబహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జనసేనలో చేర్పించుకోవడాని తప్పుపడుతున్నారు టిడిపి నేతలు. తమను సంప్రదించకుండా బాలినేనిని పార్టీలో చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం అర్బన్ లో సైతం ఇదే పరిస్థితి ఉంది.
* అక్కడ అంతా విభిన్నం
టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల జనసైనికులను పట్టించుకోవడం లేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట టిడిపి క్యాడర్ నిరాదరణకు గురవుతోంది. నామినేటెడ్ పదవుల విషయంలో సైతం సరైన సమన్వయం లేదు. ఇదే విభేదాలకు కారణమవుతోంది. తమ అధినేతను గౌరవించడం లేదని ఒకరు, తమ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదని మరికొందరు ఇలా రచ్చ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అవి విభేదాలకు ప్రధానకారణాలుగా మారుతున్నాయి. ఈ విషయంలో పార్టీల లైన్ దాటి చాలామంది నేతలు వ్యవహరిస్తున్నారు.
* అవకాశం చూస్తున్న వైసిపి
అయితే రెండు పార్టీల శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు కలగక మానవు. అవకాశం కోసం వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. వారే రెండు పార్టీల మధ్య కీచులాటలు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియా ఎలానూ ఉంది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఒక పార్టీపై పోస్టులు పెడుతున్నారు. మరో పార్టీని కె లుకుతున్నారు. దాని ద్వారా చలిమంట వేసుకొని కాగుతున్నారు. పార్టీ అధినేతలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన రెండు పార్టీలు శ్రేణులు శృతిమించి వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ఏపీలో పొత్తు ధర్మానికి విఘాతం కలుగుతోంది. ఇకనైనా అటువంటి వాటిని నియంత్రించుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాక తప్పదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp hopes to create a rift between the alliance parties
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com