YCP Campaign: ఈ సమయంలో ఎన్నికల ముందు కూటమినేతలు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆశించినంత దూకుడుగా అయితే లేదు. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల ముందు పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో వైఎస్ఆర్సిపి ఒక్కసారిగా జూలు విధిల్చింది. ఎన్నికల హామీలు అమలు చేయాలని పోరాటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా పోరుకు రంగం సిద్ధం చేసింది. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ మీది.. పోరాటం మాది అనే క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది.
ఉద్దేశం ఏంటంటే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అరాచకాలు పెరిగిపోతున్నాయని.. అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. దాడులు తారాస్థాయికి చేరాయని వైఎస్ఆర్సిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కూటమిలో టిడిపి నాయకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని.. దౌర్జన్యానికి తెగబడుతున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అటువంటి ఘటనలపై ప్రజలే తిరగబడాలని పిలుపునిస్తున్నారు. ఇందులో భాగంగానే కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలను.. అన్యాయాలను తమ ఫోన్లలో ఫోటోలు తీసి.. పంపిస్తే.. వైసీపీ తరఫున అండగా నిలబడతామని వారు ధైర్యం చెబుతున్నారు..” కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు పెరిగిపోయాయి. అన్యాయాలు సర్వ సాధారణమైపోయాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి. ప్రజలు ఇటువంటి వాటిని అడ్డుకోవాలి. ఇవన్నీ జరగాలంటే వారే రంగంలోకి దిగాలి. తమ ఫోన్లలో అన్యాయాలను.. అక్రమాల తాలూకూ సంబంధించిన ఘటనల ఫోటోలు తీసి మాకు పంపిస్తే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కూటమి నాయకులు చేస్తున్న తప్పులను ఎండగడతాం.. అప్పుడు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుంది. కూటమి నాయకులు ఎలాంటి తప్పులు చేస్తున్నారో ప్రజలకు అవగతం అవుతుందని” వైసీపీ నాయకులు అంటున్నారు.. మరోవైపు టిడిపి కూడా ఇటువంటి ఇటువంటి క్యాంపెయిన్ ను ఎన్నికల ముందు చేసింది. ప్రస్తుతం కూడా కొనసాగిస్తోంది. చూడాలి మరి.. రెండు పార్టీల మధ్య ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ దేని వైపుకు దారి తీస్తుందో.. అయితే వైసిపి క్యాంపెయిన్ పై టిడిపి నాయకులు మండిపడడం మొదలుపెట్టారు.. రాష్ట్రాన్ని నాశనం చేసింది గాక.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయడం దారుణమని ఆరోపిస్తున్నారు.. క్యాంపెయిన్ చేయాల్సింది వైసీపీ నాయకులు కాదు.. ముందు వారి పరిపాలన కాలంలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూడాలని.. వాటి తాలూకు ఫోటోలను వైసిపి తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని టిడిపి నాయకులు హితవు పలుకుతున్నారు.
పోస్ట్ మీది పోరాటం మాది ✊ pic.twitter.com/ylw5EjGYcG
— Be With Jagan (@BewithJagan) January 28, 2025