Homeఆంధ్రప్రదేశ్‌GVMC Elections : అధికారం ఎక్కడుంటే... మేము అక్కడే.. కండువాలు సిద్ధం చేసుకోండి.. టీడీపీ, జనసేనవైపు...

GVMC Elections : అధికారం ఎక్కడుంటే… మేము అక్కడే.. కండువాలు సిద్ధం చేసుకోండి.. టీడీపీ, జనసేనవైపు హైప్ అందుకే!

GVMC Elections : ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్టణం. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉంది. దీనిని కైవసం చేసుకోవాలని ఇప్పుడు టీడీపీ భావిస్తోంది. సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉన్న టీడీపీ, జనసే, బీజేపీ కూటమి ఇప్పుడు ఏం చేసిన చెల్లుతుంది. ఇదిలా ఉంటే… ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే టీడీపీ, జనసేనలో చేరారు. ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అధికార కూటమికి హౌస్‌ఫుల్‌ అయిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కునే ఆలోచనలో లేదు. కానీ, స్థానిక సంస్థలు అయిన మున్సిపల్‌. జిల్లా పరిషత్, మండలపరిషత్‌లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మొదటగా విశాఖ కార్పొరేషన్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే జీవీఎంసీలోని కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేకు గంటా శ్రీనివాస్‌రావు నేతృత్వంలో టీడీపీలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. జీవీఎంసీలో ప్రస్తుతం వైసీపీకి 58 మంది కార్పొరేట్లు ఉన్నారు. వీరందరినీ చేర్చుకోకుండా జీవీఎంసీ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన 20 మందిని టీడీపీ, జనసేనలో చేరికలకు అనుమతి ఇచ్చారు.

అప్రమత్తమైన వైసీపీ…
జీవీఎంసీపై అధికార టీడీపీ దృష్టి పెట్టిన నేపథ్యంలో వైసీపీ అలర్ట్‌ అయింది. దీంతో జీవీఎంసీ కార్పొరేటర్ల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లందరూ హాజరు కావాలని హుకూం జారీ చేసింది. కానీ, శనివారం నిర్వహించిన సమావేశానికి 58 మందిలో 42 మంది మాత్రమే హాజరయ్యారు. 16 మంది డుమ్మా కొట్టారు. దీంతో వీరంతా టీడీపీ, జనసేనలో చేరడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది.

అధిష్టానంపై ఆగ్రహం..
ఇదిలా ఉంటే సమావేశానికి వచ్చిన 42 మంది కూడా పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్పుడు తమను ఏమాత్రం లెక్క చేయలేదని, టీడీపీ, జనసేనను చూసినట్లుగానే తమను కూడా చూశారని ఆరోపించారు. ఇప్పుడు మా అవసరం వచ్చిందా? అంటూ నిలదీశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రా ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డిలు తమను చాలా చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు మంత్రులు రోజా, రాంబాబు, కొడాలి నాని వంటివారు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని ఉద్దేశించి చులకనగా మాట్లాడేవారని, కానీ సొంత పార్టీ కార్పొరేటర్లమైన తమను కూడా అదేవిదంగానే ట్రీట్‌ చేయడాన్ని నేటికీ సహించలేకపోతున్నామని వారు స్పష్టం చేశారు. గుడివాడ అమర్నాథ్‌ వారికి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు ఎదురు ప్రశ్నలు వేశారే తప్ప ఎవరూ ఆయన మాట వినలేదు. కనుక టీడీపీ జనసేన కండువాలు సిద్ధం చేసుకుంటే వారు కూడా ఆయా పార్టీల్లో చేరవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

16 మంది రహస్యభేటీ...
ఒకవైపు వైసీపీ సమావేశం జరుగుతుండగానే. మరోవైపు సమావేశానికి గైర్హాజరైన 16 మంది విశాఖలోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. టీడీపీలో చేరిక, అందుకు దక్కే ప్రతిఫలంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular