Pawan Kalyan : గత కొద్దిరోజుల నుండి ఆంధ్ర ప్రదేశ్ లో ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి ప్రజలు విస్తృతంగా మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతీ ఇంటికి వెళ్లి వ్యక్తిగత వివరాలను తీసుకోవడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం అయ్యింది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేస్తూ పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను తగలపెట్టడం వంటివి చేసారు.
దానికి దీటుగా జనసేన పార్టీ నాయకులు కూడా జగన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్త పరుస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వేసిన ఈ స్ట్రాటజీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు జనాలు వాలంటీర్స్ కి వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి అంటేనే భయపడుతున్నారు. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు, ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.
ఇక నేడు పవన్ కళ్యాణ్ తణుకు లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వాలంటీర్ వ్యవస్థ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో చెప్పుకొచ్చాడు. వాలంటీర్స్ కి ఇప్పటి వరకు 705 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. ఈమధ్య అమ్మవడి పథకాన్ని ఆపేసారు, వృద్దాప్య పింఛన్స్ ఆపేసారు, చివరికి ఆరోగ్య శ్రీ కి ఇవ్వాల్సిన నిధులను కూడా ఆపేసారు.
అంగనవాడి టీచర్లకు జీతాలు పెంచుతాను అని చెప్పి, ఇచ్చే జీతాలను కూడా సరిగా ఇవ్వకపోవడం వల్ల, వారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము. ఈ డబ్బులు మొత్తం ఎగగొట్టడానికి కారణం జగన్ తన కోసం తయారు చేయించుకున్న వాలంటీర్ వ్యవస్థ ని రన్ చెయ్యడం కోసమే అని నేడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ ఎదో నోటి మాట లెక్క చెప్పలేదు, కాగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ని పెట్టుకొని చెప్పాడు. దీనికి వైసీపీ పార్టీ నాయకులు సమాధానం చెప్తారో లేదో చూడాలి.