Venu Swamy: వేణు స్వామి.. అయితే కాషాయం లేకుంటే పసుపు వర్ణంలో దుస్తులు ధరిస్తాడు. జాతకాలు చెబుతుంటాడు. హీరోయిన్ల పేర్లు మార్చుతుంటాడు. ఒకప్పుడు ఇతన గురించి. అంతగా తెలిసేది కాదు. సోషల్ మీడియా వ్యాప్తి పెరిగిన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సెలబ్రిటీ అయిపోయాడు. దీంతో అతడు తనను తాను దైవం సంభూతుడిగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. తను జాతకం చెబితే ఏదైనా జరుగుతుందని.. తన చేతికి మహార్జాతకం ఉందని ప్రచారం చేసుకోవడం ప్రారంభించాడు. అక్కడితోనే అతడు ఆగలేదు. జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు.. ఏం జరగబోతుందో అంచనా వేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. అందులో అతడు చెప్పినవి కొన్ని జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. సహజంగానే అంత పేరు వచ్చింది కాబట్టి అతడికి హిపోక్రసీ పెరిగింది. అది అతనిలో అహాన్ని మరింతగా పెంచింది.
ఇటీవల వేణు స్వామి తనకు తానుగా చెప్పిన ప్రిడిక్షన్లన్నీ ఎదురు తంతున్నాయి. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ గెలుస్తుందని చెబితే.. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అంటే.. ఆయన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.. చివరికి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు.. ఇక ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు గెలుస్తుందని.. కావ్య జాతకం బాగుందని వేణు స్వామి అన్నారు.. కానీ కోల్ కతా చేతిలో దారుణమైన పరాజయాన్ని హైదరాబాద్ మూట కట్టుకుంది. ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి, రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడని వేణు స్వామి జాతకం చెబితే.. అది కూడా తప్పయింది. పైగా వైసిపి అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది.
ఇవేవీ జరగలేదు. పైగా అతను చెప్పిన తర్వాత ఆ వ్యక్తులు ఓటమి పాలయ్యారు. అతడు గెలుస్తాడని చెప్పిన జట్లు పరాజయం పాలయ్యాయి.. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి చరిష్మా తగ్గింది. అతడి క్రేజ్ పడిపోయింది. స్థూలంగా చూస్తే అతడు మామూలు మనిషి అని తేలిపోయింది. ఇలా వరుసగా అతడు చెప్పిన విషయాలన్నీ అడ్డంగా తన్నడం మొదలు పెట్టడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు ఏకిపారేయడం మొదలుపెట్టారు.. దీంతో వేణు స్వామి తగ్గాడు. ఇన్నాళ్లపాటు ఆకాశంలో విహరించిన అతడు కిందికి దిగివచ్చాడు.
మంగళవారం వెల్లడైన ఫలితాలలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణమైన ఓటమిని మూటగట్టుకోవడంతో.. వేణు స్వామి బయటకు వచ్చాడు.. ఇకనుంచి తాను జాతకాలు చెప్పనని స్పష్టం చేశాడు. ” కొద్దిరోజులుగా నన్ను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. నేను కేంద్రంలో మోడీ ప్రభావం తగ్గుతుందని చెప్పాను. అది నిజమైంది. చంద్రబాబు ఓడిపోతారని అన్నాను. జగన్ గెలుస్తారని చెప్పాను. కానీ అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. నేను నక్షత్రాల ఆధారంగా, జాతకాల ఆధారంగా ప్రిడిక్షన్ చెబుతాను. ఇకనుంచి నేను చెప్పడం మానేస్తాను. నేను నమ్మే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, కామాఖ్య దేవి సాక్షిగా.. జాతకాలు ఇకనుంచి చెప్పను.” వేణు స్వామి అన్నాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో వేణు స్వామి మీద ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఆయన తను ఇక ముందు నుంచి ప్రిడిక్షన్ చెప్పనని స్పష్టం చేశాడు.. ఒక వీడియోలో తన మనోగతాన్ని వెల్లడించాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More