Abhishek Reddy: వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి( Abhishek Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన మృత్యువాత పడ్డారు. అభిషేక్ రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కడప( Kadapa ) జిల్లా వైసీపీలో అభిషేక్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాన్ని పులివెందులకు తరలించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నివాళులు అర్పించేందుకు వైయస్ జగన్ పులివెందుల వెళ్ళనున్నారు. వైఎస్ కుటుంబంతో పాటు వైసిపి శ్రేణుల్లో కూడా విషాదం అలుముకుంది. అభిషేక్ రెడ్డి జగన్కు సమీప బంధువు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి( Avinash Reddy) తండ్రి భాస్కర్ రెడ్డి అన్న ప్రకాశ్ రెడ్డి మనవడే అభిషేక్ రెడ్డి.
* ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతారని
వైయస్ వివేకానంద రెడ్డి ( Y S Vivekananda Reddy )హత్య కేసులో అవినాష్ రెడ్డి చిక్కుకున్న సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి చుట్టూ ఆరోపణలు నడిచాయి. దీంతో అవినాష్ రెడ్డిని తప్పించి అభిషేక్ రెడ్డిని తెరపైకి తెస్తారని ప్రచారం నడిచింది. అభిషేక్ రెడ్డి వృత్తి రీత్యా వైద్యుడు. డాక్టర్ గా ఉంటూనే వైసీపీ కోసం పనిచేశారు. వైసిపి వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా పదవి చేపట్టారు. పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండల ఇన్చార్జిగా కూడా ఉన్నారు.
* వైసీపీ తరఫున ప్రచారం
ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు అభిషేక్ రెడ్డి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్( Jagan Mohan Reddy ) తరుపున అన్ని తానై వ్యవహరించారు. కడప జిల్లాలో సైతం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. జగన్ పాదయాత్ర సమయంలో సైతం అభిషేక్ రెడ్డి చాలా యాక్టివ్ గా పని చేసేవారు. గత ఏడాది సెప్టెంబర్లో అభిషేక్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే చర్చ నడిచింది. దీనిపై రాజకీయంగా కూడా వివాదాలు నడిచాయి. అభిషేక్ రెడ్డికి వివేకానంద రెడ్డి కేసుకు లింక్ చేస్తూ టిడిపి ట్వీట్ చేసింది. అప్పట్లో అది పెను రాజకీయ దుమారానికి కారణమైంది. అయితే అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ స్థానానికి పోటీ చేయిస్తారని ప్రచారం నడిచింది. కానీ అభిషేక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో ఆ నిర్ణయం విరమించుకున్నట్లు సమాచారం. అక్కడకు కొద్ది రోజులకే అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. వైసీపీలో తీరని విషాదాన్ని నింపారు.
* నేడు అంత్యక్రియలు
ఈరోజు అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరగనున్నాయి. మృతదేహాన్ని హైదరాబాద్( Hyderabad) నుంచి పులివెందులకు తరలించారు. నివాళులు అర్పించేందుకు జగన్ పులివెందుల వెళ్ళనున్నారు. మరోవైపు వైఎస్ కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కడపలో బలమైన నాయకుడిని కోల్పోవడంతో బాధపడుతున్నాయి. అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు వైఎస్ కుటుంబమంతా పులివెందుల చేరుకుంది.