Middle Class People2025: కారు కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ ఎలాంటి కారు కొనాలి..? ఏ కారు కొనాలి..? అనే సందేహంలో ఉండేవారు ఎందరో ఉన్నారు. అయితే ఎక్కువ శాతం తక్కువ ధరలో కారు కొనుగోలు చేసి.. ఎక్కువ మైలేజ్ ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మైలేజ్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 2025 కొత్త ఏడాదిలో కొన్ని కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో మారుతి కంపెనీ నుంచి కొన్ని కార్లు అప్డేట్ అయి, అత్యధిక మైలేజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. ఈ ఏడాదిలో ఈ కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ కారు ఏమో తెలుసుకుందాం..
మారుతి కంపెనీ నుంచి హ్యాచ్బ్యాక్ కార్లు ఎక్కువగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇదే కంపెనీ నుంచి SUV కార్లు కూడా ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి. వీటిలో మొట్టమొదటిసారిగా కంపెనీ నుంచి రిలీజ్ అయిన SUV Grand vitaaraa ప్రత్యేకత చాటుకుంది. ఈ మోడల్ లో 1.5 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇది ఇప్పుడు అప్డేట్ అయి రాబోతుంది. ఇందులో కొత్తగా 1.5 లీటర్ మైండ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ ను అమర్చారు. 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేస్తుంది సిఎన్జి CNGలో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉండవచ్చని అంటున్నారు. అయితే కొత్తగా వచ్చే గ్రాండ్ విటారా లీటర్ ఇంధనానికి 20.58 నుంచి 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటుంది.
మారుతి కంపెనీ నుంచి మరో కారు కొత్త ఏడాదిలో రావడానికి సిద్ధంగా ఉంది అదే E-Vitaaraa. ఎలక్ట్రిక్ విభాగంలో ఈ-విటారా రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల మిలాన్ లో జరిగిన ఒక ఈవెంట్లో సుజుకి మోటార్ కార్పొరేషన్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను ఆవిష్కరించింది. ఈ మోడల్ లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో ఆకట్టుకోనుంది. దీని ధర రూ.22 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
మారుతి బ్రెజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మోడల్ ఈ ఏడాదిలో అప్డేట్ ఫీచర్లతో విడుదల కాబోతుంది. ఇప్పటివరకు ఉన్న మోడల్ తో పోలిస్తే కొత్త బ్రెజ్జాలో అదనపు సదుపాయాలు జోడించనున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. దీని ప్రారంభ ధర 8.50 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించే అవకాశం ఉంది. మార్కెట్లో ఉన్న సబ్ కాంపాక్ట్ SUVలతో బ్రెజ్జా పోటీ పడే అవకాశం ఉంది.
మారుతి హ్యాచ్ బ్యాక్ కార్ల లో బాలెనో గురించి ఎక్కువగా చర్చించుకుంటారు. ఇది చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే కారు అయితే 2025లో ఈ కారు కూడా అప్డేట్ తో మార్కెట్లోకి రాబోతుంది.