Homeఆంధ్రప్రదేశ్‌Yanamala Rama Krishnudu: మారిన యనమల రూటు!

Yanamala Rama Krishnudu: మారిన యనమల రూటు!

Yanamala Rama Krishnudu: యనమల రామకృష్ణుడుకు( yanamala Ramakrishnudu ) చంద్రబాబు నుంచి హామీ వచ్చిందా? గౌరవప్రదమైన పదవీ విరమణ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారా? రాజ్యసభకు పంపిస్తానని తన మాటగా చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈనెల 31 తో ఎమ్మెల్సీగా యనమల పదవీకాలం ముగియనుంది. కానీ ఆయన పదవీ విరమణ సభకు గైర్హాజరయ్యారు. శాసనమండలి బడ్జెట్ సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. చివరికి ఫోటో సెషన్స్ కు కూడా హాజరు కాలేదు. దీంతో ఎమ్మెల్సీ గారు రెన్యువల్ చేయకపోవడంతో యనమల అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా వ్యాఖ్యానాలు చేశారు యనమల రామకృష్ణుడు.

Also Read:  ఏపీలో ‘అవిశ్వాసాల’ ఫీవర్.. నెల రోజుల్లో అధికార మార్పిడి!

 

* సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) సుదీర్ఘ నేపథ్యంలో ఉన్న వారిలో యనమల ఒకరు. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే సీనియర్ కూడా యనమల. 1983 నుంచి 1999 వరకు ఐదుసార్లు తుని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు యనమల రామకృష్ణుడు. బీసీ వర్గానికి చెందిన రామకృష్ణుడుకు ఎన్టీఆర్ కూడా ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. 1994లో అయితే ఏకంగా శాసనసభ స్పీకర్ గా ఎంపిక చేశారు. అయితే 1995లో టిడిపి సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారు యనమల. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ ఉన్నతికి దోహదపడ్డారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు సైతం యనమలకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు.

* ఎమ్మెల్సీ ని మంత్రి చేసి..
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ యనమల రామకృష్ణుడు ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా( MLC) ఉన్న యనమలను తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి చేశారు చంద్రబాబు. అయితే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమయ్యారు. తన బదులు కుమార్తె దివ్యతో పోటీ చేయించారు. ఆమె సైతం విజయం సాధించింది. అయితే యనమలకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీగా కూడా ఛాన్స్ ఇవ్వలేదు.

* ఆ ప్రచారానికి విరుద్ధంగా..
అయితే చంద్రబాబు( Chandrababu) తీరుపై యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎటువంటి అసంతృప్తి లేదని.. కొత్త తరం రావాలంటే పాత తరం వెళ్లాలని.. కొత్త తరాన్ని ఆహ్వానించడంలో ముందు ఉంటానని తేల్చి చెప్పారు. తనకు పార్టీ ఫైనల్ అని.. తనలో ఎటువంటి అసంతృప్తి లేవని వెల్లడించారు.

అయితే యనమల రామకృష్ణుడు ప్రకటన చూసిన తర్వాత ఆయనకు పదవి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీ నుంచి చాలామంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఆ సమయంలో రాజ్యసభ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు యనమల. పెద్దల సభలో అడుగు పెట్టాలన్నది యనమల లక్ష్యం. చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఇంటర్వ్యూలో టిడిపి తో పాటు చంద్రబాబు కు యనమల సానుకూలంగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version