AP Municipalities and municipal corporations
Andhra Pradesh : స్థానిక సంస్థల్లో( local bodies) ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దాదాపు ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్లు, నగరపాలక సంస్థల్లో మేయర్లు. ఇలా అందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. 2021 లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తాడిపత్రి, దర్శిలో మాత్రమే విజయం సాధించింది టిడిపి. మిగతా అన్నిచోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం. అయితే ఇప్పుడు అవే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నాయి.
Also Read : చిక్కుల్లో తమ్మినేని.. ఏపీ ప్రభుత్వం సీరియస్!
* 18 తో ముగిసిన గడువు..
అయితే స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గం పదవీకాలం నాలుగేళ్లు పూర్తయిన వరకు అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని ఒక చట్టం తీసుకొచ్చింది వైయస్సార్ కాంగ్రెస్( y s r Congress ) ప్రభుత్వం. దానికి సంబంధించి గడువు ఈనెల 18 తో ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలలో అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతోంది కూటమి. ఒకటి రెండు మినహాయించి దాదాపు అన్నిచోట్ల అవిశ్వాస తీర్మానాలు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. టిడిపి కూటమికి కనీస ప్రాతినిధ్యం లేని మున్సిపాలిటీలో సైతం అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతోంది కూటమి. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమికి జై కొట్టారు. దీంతో కూటమి సైతం ఈ అవకాశాన్ని రాజకీయంగా మలుచుకోవాలని భావిస్తోంది.
* అన్ని కార్పొరేషన్లు కైవసం..
2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో( Municipal Elections ) 11 కార్పొరేషన్లకు గాను.. 11చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇంతటి విజయం అధికార పార్టీకి దక్కలేదు. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం కార్పొరేషన్లు అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. 75 మున్సిపాలిటీలకు గాను 73 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది.
* రాష్ట్రమంతటా అదే పరిస్థితి..
అయితే ఇప్పుడు సీన్ మారింది. కూటమి( allians ) అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం అధికార పార్టీతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గడువు ముగిసింది. దీంతో మున్సిపాలిటీలో పట్టు కోసం అధికార కూటమి ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అవిశ్వాసాలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చేందుకు కూటమి సిద్ధపడింది. విశాఖ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు కూటమి నేతలు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల రోజుల్లో అధికార మార్పిడి ఖాయమని తెలుస్తోంది.
Also Read : యాక్షన్ లోకి సోము వీర్రాజు.. మైక్ కనిపిస్తే జగనే టార్గెట్