YCP: వైసీపీలో జూనియర్ ఫైర్ బ్రాండ్లు.. శృతిమించుతున్న టీవీ చర్చలు

న్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలైంది. 175 స్థానాలకు గాను.. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ప్రజలకు అన్నీ చేసిన తిరస్కరించారని వైసీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు. అయితే కొందరి నోటి దూల మూలంగానే తమకు నష్టం జరిగిందన్న వారు కూడా ఉన్నారు. ఈ తరుణంలో సీనియర్లు సైలెంట్ అయ్యారు. కానీ జూనియర్ బ్యాచ్ హడావిడి మొదలైంది. ఎంత తిడితే అంత బాగా మీడియాలో హైలెట్ కావచ్చు అన్న పాలసీని కొంతమంది నమ్ముకున్నారు. ఈ క్రమంలో తిట్టేవారు, తిట్టించేవారు కూడా అసలు జనం తమ గురించి ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోవడం మానేశారు.

Written By: Dharma, Updated On : July 10, 2024 1:34 pm

YCP

Follow us on

YCP: వాడు,వీడు,లేపేస్తాం..వాడికి అసలు జీవో చదవడం వచ్చా?వాడు అసలు ఎమ్మెల్యేగా పనికొస్తాడా? జొమాటో డెలివరీ బాయ్ సీఎం అయ్యాడు..ఇలా విమర్శలు చేసింది ఎవరో తెలుసా? వైసీపీలో ఓ జూనియర్ నేత. ఎవరి గురించో తెలుసా?పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి. ప్రస్తుతం టీవీ చానల్లో రాజకీయ చర్చలు ఇలా శృతిమించుతున్నాయి. పబ్లిసిటీ పిచ్చి వారితో అలా మాట్లాడిస్తోంది. మాజీ సీఎం జగన్ కి చెందిన సాక్షి ఛానల్ అసహ్యంగా సాగిన రచ్చ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలైంది. 175 స్థానాలకు గాను.. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ప్రజలకు అన్నీ చేసిన తిరస్కరించారని వైసీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు. అయితే కొందరి నోటి దూల మూలంగానే తమకు నష్టం జరిగిందన్న వారు కూడా ఉన్నారు. ఈ తరుణంలో సీనియర్లు సైలెంట్ అయ్యారు. కానీ జూనియర్ బ్యాచ్ హడావిడి మొదలైంది. ఎంత తిడితే అంత బాగా మీడియాలో హైలెట్ కావచ్చు అన్న పాలసీని కొంతమంది నమ్ముకున్నారు. ఈ క్రమంలో తిట్టేవారు, తిట్టించేవారు కూడా అసలు జనం తమ గురించి ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోవడం మానేశారు. ఇటీవల సాక్షి ఛానల్లో వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇటీవల రేవంత్ రెడ్డి వైయస్సార్ జయంతి వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. షర్మిల కు మద్దతుగా జగన్ ను టార్గెట్ చేసుకొని కామెంట్స్ చేశారు. దీనిపైసాక్షి టీవీ డిబేట్లో దారుణంగా మాట్లాడారు నాగార్జున యాదవ్.రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సీఎం అని మరిచి స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారు. వాడు వీడు అంటూ సభ్యత లేకుండా మాట్లాడారు. దీనికి సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అడ్డు చెప్పకపోగా.. రెచ్చగొడుతూ మాట్లాడించడం విశేషం.మరో డిబేట్లోఇదే నాగార్జున యాదవ్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. నాడు అలిపిరి వద్ద వెంకటేశ్వర స్వామి వదిలేశారని.. ఈసారి తీసుకెళ్లి పోతారని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి వారితో వైసిపి మూల్యం చెల్లించుకుందని.. ఒక సెక్షన్ ప్రజలు ఇటువంటి వాటికి హర్షించరని.. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం మేల్కొనకుంటే ఆ పార్టీకి నష్టమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.