World Yoga Day Visakhapatnam: మరికొద్ది గంటల్లో విశాఖ( Visakhapatnam) సాగర నగరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలతో విశాఖ చరిత్ర మరోసారి మార్మోగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తవుతున్నాయి. ఒకే చోట ఐదు లక్షల మంది యోగాసనాలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 26 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు, రోడ్డుపై మ్యాట్లు, విద్యుత్ దీపాలు, ఎల్ఈడి స్క్రీన్లు, శిక్షకులకు వేదికలు.. ఇలా సర్వం సిద్ధం చేస్తున్నారు.
Also Read: Visakhapatnam Yoga 2025: Why Did Modi & Chandrababu Choose Vizag?
అయితే ప్రస్తుతం చెదురు మదురుగా వర్షాలు పడుతుండడంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే అప్పటికప్పుడు వేదికను మార్చేందుకు వీలుగా.. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ రోడ్ లో రాకపోకలను నిలిపివేశారు నిన్నటి నుంచి. అయితే ప్రజలకు ట్రాఫిక్ అవస్థలు తప్పడం లేదు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో విశాఖకు యోగా దినోత్సవం ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని నగరవాసులు నమ్మకంతో ఉన్నారు.విశాఖ నగరంలో శనివారం ఉదయం 6:25 గంటలకు యోగాంధ్ర 2025 ప్రారంభం అవుతుంది. ఉదయం 6:30 గంటల నుంచి ఏడు గంటల వరకు అతిధులు ప్రసంగిస్తారు. తొలుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి స్వాగత ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత సీఎం ప్రసంగం ఉండనుంది. ప్రధాని మోదీ 15 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. సరిగ్గా ఏడు గంటలకు ఆసనాలు ప్రారంభిస్తారు.
Also Read: Vishakha Yoga Day: బీచ్ రోడ్డు మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపు.. 12,000 మంది పోలీసులతో భద్రత!
1. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( Narendra Modi)ఈ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. తిరిగి చంద్రబాబు రాత్రికి విశాఖ కలెక్టరేట్ కు చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేసి.. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో జరిగే యోగ వేడుకల్లో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రధాని మోదీని వీడ్కోలు పలికి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
2. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం యోగా దినోత్సవం లో పాల్గొనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విశాఖ చేరుకుంటారు. ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత కోర్టు అతిథి గృహానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో జరిగే యోగా దినోత్సవం లో పాల్గొంటారు.
3. మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి యోగా వేడుకల ఏర్పాట్లపై సమీక్ష చేస్తారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసి.. శనివారం ఉదయం వేడుకల్లో పాల్గొంటారు.