Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu work from home statement: వర్క్ ఫ్రం హోం అనేది ఇక ఫ్యూచర్ కాదు…...

Chandrababu work from home statement: వర్క్ ఫ్రం హోం అనేది ఇక ఫ్యూచర్ కాదు… అది ఇప్పుడు రియాలిటీ

Chandrababu work from home statement: పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనదేశంలోనూ కనిపిస్తోంది. అందుకే ముందస్తు సన్నాహంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు సూచనలు చేశారు. ఇందన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని.. ఇలా పలు రకాల సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని సూచనలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాలను పాటించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంపై మాట్లాడారు సీఎం చంద్రబాబు.

కొవిడ్ తర్వాత
కరోనా వచ్చిన తరువాత వర్క్ ఫ్రం హోం అనేది వెలుగులోకి వచ్చింది. కంపెనీలు ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు.. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు గాను అప్పట్లో వర్క్ ఫ్రం హోం అమలు చేశారు. అయితే ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం అమలవుతూనే ఉంది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం అంటూ ఒక సర్వే చేపట్టింది. ఇంట్లో ఉండి ఉపాధి పొందేందుకు వీలుగా ఈ సర్వే సాగింది. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని చూసింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8 అంశాల్లో పొదుపు పాటించాలని పిలుపునివ్వడంతో.. వర్క్ ఫ్రం హోం ను పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. గజగదానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంటి నుంచే పని..
వర్క్ ఫ్రం హోం అనేది రియాలిటీ. ఇంటి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి ఉంటుంది. దీనికి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం విశేషం. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానం తెస్తామని.. తద్వారా దుబారా ఖర్చును తగ్గిస్తామన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా తమ కాన్వాయ్ వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా సెక్యూరిటీ తగ్గించుకునే పనిలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే కంటే మన దేశంతో పాటు సొంత రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా పొదుపు మంత్రం పై కీలక సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular