YS Jagan Mohan Reddy : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఇంటి వద్ద ఓ మహిళ హల్చల్ చేసింది. ఆమె వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. అద్దంకి ప్రాంతానికి చెందిన ఆమె జగన్మోహన్ రెడ్డితో ఫోటో కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించింది. ఒక్క దశలో ఫోటో తీస్తే తప్ప.. తాను అక్కడ నుంచి కదలనని మొండి పట్టు పట్టింది. దీంతో వైసిపి గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ నారాయణ మూర్తి ఆమెను తీసుకుని తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. జగన్ తో ఫోటో తీయించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆమె కొత్త ట్విస్ట్ కు తెర తీశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అలానే ఉండిపోయింది. ఎంత చెప్పినా ఆమె వినడం లేదు.
* ఫోటో కోసం కాదట
తొలుత ఆమె ఫోటో కోసం అలా చేశారని అంతా భావించారు. తీరా ఫోటో తీయించుకున్న తర్వాత కూడా ఆమె అలానే ఉండిపోవడం ఆందోళన కలిగించింది. జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) వ్యక్తిగత సిబ్బంది వచ్చి వరించిన వినలేదు. చివరకు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కళ్యాణ్ రాజు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులను చూసి ఆందోళనకు గురైన ఆమె.. తనకు అప్పులు ఉన్నాయని.. జగన్మోహన్ రెడ్డికి చెబితే తీర్చుతారని భావించి అలా చేశానని చెప్పుకొచ్చారు. ఆమె తీరు అనుమానంగా ఉండడంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించారు. ప్రస్తుతం ఆమె వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల అభిమానుల పేరిట చాలామంది నేతల సాయం పొందుతున్నారు. ఈ తరుణంలోనే ఈ మహిళ అలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
* వరుస ఘటనలు
అయితే జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతుండడం పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజుల కిందట తిరుమల లడ్డు( Tirumala laddu) వివాదం నేపథ్యంలో బిజెపి యువమోర్చా నాయకులు జగన్ నివాసం పై దూసుకు వచ్చారు. నిరసన చెప్పే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేకెత్తించింది. గత నెల 23న మంత్రి నారా లోకేష్ జన్మదినం. ఆ సమయంలో టిడిపి కార్యకర్తలు వాహనాల్లో ర్యాలీగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదుట హల్చల్ చేశారు. కొద్ది రోజుల కిందటే జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంగణంలోనే కొన్ని రకాల వస్తువులు కాలిపోతుండగా భద్రతా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
* తరచూ ఇటీవల ప్రయత్నాలు
అయితే ఇటీవల వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అధినేతలను కలిసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో( social media) వైరల్ అయ్యేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఓ మహిళ పడిగా పులు కాయడం సోషల్ మీడియాలో హైలెట్ అయింది. వెంటనే వైసీపీ నేతలు స్పందించేలా చేసింది. అయితే ఆమె జగన్తో ఫోటో కోసమే ఆ ప్రయత్నం చేశారని అంతా భావించారు. కానీ ఆర్థిక నష్టాల్లో ఉన్న తనకు ఆదుకుంటారని ఆ పని చేశానని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.