Prabhas : యంగ్ రెబల్ స్టార్ (Young Rebal Star) గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) అనే సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా షూట్ లో పాల్గొంటున్న ఆయన తన తదుపరి సినిమా విశేషాలను కూడా తెలియజేస్తున్నాడు. ఇక మే నుంచి స్పిరిట్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడుతుంటారు. ఎలాంటి ఈగో లేకుండా ప్రభాస్ అందరిని సమానంగా చూస్తూ ఎలాంటి కాంట్రవర్సులకు కూడా తావివ్వకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలుస్తూ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అందరితో చనువుగా ఉంటాడు. ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ ఒక స్టార్ డైరెక్టర్ సక్సెస్ పార్టీని ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్లారట. ఇక అక్కడ కింద కూర్చోడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… అసలు విషయంలోకి వెళ్తే డేరింగ్ అండ్ డాషింగ్ మంచి గుర్తింపును సంపాదించుకున్న పూరి జగన్నాధ్ (Puri jagannadh) అమితాబచ్చన్(Amitha Bachhan)తో చేసిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమా సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సన్నిహితులను పిలిచి పార్టీ ఇచ్చారట. మరి ఈ సందర్భంలోనే ఆ పార్టీకి ప్రభాస్ కూడా అటెండ్ అయ్యాడట. అయితే పార్టీలో చాలామంది ఉన్నారు ఇక పార్టీ దాదాపు 9 గంటలకు స్టార్ట్ అయితే మరుసటి రోజు మార్నింగ్ 4 గంటల వరకు సాగిందట.
ఇక ప్రభాస్ కూడా నాలుగింటి వరకు అక్కడే ఉండి నేను వెళ్ళిపోతున్నాను డార్లింగ్ అని పూరి జగన్నాథ్ చెబితే అప్పుడు పూరి ప్రభాస్ ను ఉండమని చెప్పి ఒకచోట రోడ్డు సైడ్ వేసే ఇడ్లీ బాగుంటుంది నేను తెప్పిస్తాను అది తినేసి వెల్దువు గాని అని చెప్పారట. ఇక పూరి వాళ్ళ అసిస్టెంట్ తో ఆ ఇడ్లీ ని తెప్పించారట. ఇక అక్కడ సోఫాల్లో మొత్తం పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూర్చోవడంతో ఎక్కడ కూర్చోవడానికి ఖాళీ లేకపోవడంతో ప్రభాస్ కింద కూర్చోని అక్కడే కంఫర్ట్ గా ఉందని చెప్పి ఇడ్లి తిన్నాడట.
ఇక అది తిని సూపర్ గా ఉందని చెప్పి ఇంటికెళ్ళి పోయారట. ఇది చూసిన వాళ్లంతా ప్రభాస్ అంత పెద్ద హీరో అయి ఉండి కింద కూర్చోవడం ఏంటి అంటూ ఆశ్చర్య పోయారట. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్టీ లో ఉన్నవాళ్లకు డిస్ట్రబ్ చేయకుండా కిందే కంఫర్ట్ గా ఉంటుందని కూర్చొని తినడం ఆ సిచువేషన్ కు తగ్గట్టుగా అతను వ్యవహరించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
అతని ప్లస్ లో ఇంకా వేరే హీరో ఉంది ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందని పక్కకి వెళ్ళమని పక్కనే ఉన్న సోఫాలో గానీ లేదా డైనింగ్ టేబుల్ మీద గాని కూర్చొని తినేవారు. కానీ ప్రభాస్ మాత్రం అలా చేయలేదు అంటూ అతని మీద పూరి జగన్నాథ్ తో పాటు అక్కడున్న వాళ్ళందరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు మాత్రం మా డార్లింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు…