Pawankalyan : ప్రశ్నిస్తే పవన్ కు బెదిరింపులు ఎందుకు?

మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రంగంలోకి దిగారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడారని.. వలంటీర్ల మనోభావాల దెబ్బతీశారని చెబుతూ పవన్ కు నోటీసులు అందిస్తున్నట్టు ప్రకటించారు.

Written By: Dharma, Updated On : July 10, 2023 6:45 pm
Follow us on

Pawankalyan : సున్నితమైన అంశాలను డీల్ చేయడంలో కూడా జగన్ సర్కారు ఫెయిలవుతోంది. దానిని మరింత జఠిలం చేయాలని చూస్తోంది. తద్వారా ప్రత్యర్థులను భయపెట్టి లొంగదీసుకోవాని ప్రయత్నిస్తోంది. ఒక్క విషయాన్ని మాత్రం మరిచిపోతోంది. తాను డైవర్షన్ చేశానని మాత్రమే భావిస్తోంది..కానీ ఈపాటికే అది ప్రజల్లోకి వెళ్లిపోతుందని మాత్రం గుర్తించడం లేదు. తాజాగా పవన్ వ్యాఖ్యలు ఇలానే ప్రజల్లోకి వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మంది మహిళల మిస్సింగ్ వెనుక.. వారి వివరాలు మారడమే కారణమని పవన్ ఆరోపించారు. అందుకు వలంటీరు వ్యవస్థే కారణమని చెప్పుకొచ్చారు. ప్రతీ 50 కుటుంబాల వివరాలు వారి వద్దే ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నాలుగేళ్లలో 14 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కామెంట్స్ సంచలనంగా మారాయి. నిజంగా ఇన్ని వేల మంది అదృశ్యమయ్యారా? అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్నన్నమవుతోంది. ప్రజల్లో కూడా విస్తృతమైన చర్చ నడుస్తోంది. అయితే ఇదో సున్నితమైన అంశం కావడంతో ప్రజల్లోకి వెళితే తమకు కష్టమని ప్రభుత్వానికి తెలుసు. అందుకే కట్టడి చేయాలంటే రాజకీయ వివాదం తప్ప మరొకటి కనిపించలేదు. అందుకే వలంటీర్లను రంగంలోకి దించింది. పవన్ ఆరోపణలు వచ్చిన పత్రికలను దాహనం చేయాలని ఆదేశాలిచ్చింది. తరువాత పవన్ పై ఎలాగూ పాత్రధారులు, సూత్రధారులు, వందీమాగధులు చేసే విమర్శలు షరా మామ్మూలే.

వైసీపీ నేతలు ఒక వైపు పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రంగంలోకి దిగారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడారని.. వలంటీర్ల మనోభావాల దెబ్బతీశారని చెబుతూ పవన్ కు నోటీసులు అందిస్తున్నట్టు ప్రకటించారు. అసలు ఈ ఘటనతో మహిళా కమిషన్ కు సంబంధం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలో 14 వేల మంది మహిళలు మిస్సింగ్ కాకుంటే.. అందుకు సంబంధించి రికార్డులు చూపితే సరిపోతుంది. కానీ ఆ పనిచేయకుండా రాజకీయ యాగీ చేయడం కొంచెం అతిగా కనిపిస్తోంది.

ఇంత చేస్తున్నా వైసీపీ నేతల్లో భయం కనిపిస్తోంది. కేంద్ర నిఘా వ్యవస్థ బయపెట్టిందని పవన్ నోటి నుంచి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆందోళన చెందుతోంది. పక్కా సమాచారం లేకుండా పవన్ ఆరోపణలు చేయరని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. ప్రతీ 50 కుటుంబాల పూర్తి డేటా వలంటీర్ల వద్ద ఉంటుందన్నది నిజం. ప్రతి పంచాయతీలో పది మంది వలంటీర్లు ఉంటారు. అంటే 500 కుటుంబాల సమాచారం వారి వద్ద ఉంటుంది. అందుకే పవన్ చేస్తున్న ఆరోపణలపై శూల శోధన చేస్తే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. దానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ రాజకీయ వివాదం. మహిళా కమిషన్ నోటీసులు. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.