India vs England : మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు.. ఐదు రోజులపాటు సాగినప్పటికీ.. ఫలితం భారత జట్టుకు అనుకూలంగా వచ్చింది. వాస్తవానికి ఇది ఊహించని ఫలితమే అయినప్పటికీ.. భారత జట్టు బౌలింగ్లో విఫలమైనప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్, గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్వితీయమైన పోరాటాన్ని చూపించారు. కేఎల్ రాహుల్ సెంచరీ కోల్పోయినప్పటికీ.. గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేయడం టీమిండియాకు ఊహించని ఫలితాన్ని ఇచ్చాయి.
ఐదో రోజు ఆటలో తొలి సెషన్ లో కేఎల్ రాహుల్ ను స్టోక్స్ అవుట్ చేయడంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ జట్టులో ఆనందం వ్యక్తం అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే శతకం సాధించిన గిల్ కూడా ఆర్చర్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ కాలికి అయిన గాయం మానకపోవడంతో.. అతడు బ్యాటింగ్ కు రాలేదు. దీంతో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు..గిల్ అవుట్ కావడంతో రవీంద్ర జడేజా బరిలోకి దిగాడు. రవీంద్ర జడేజా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్లిప్ లో వచ్చిన క్యాచ్ ను రూట్ వదిలేయడంతో జడేజా బతికి పోయాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ సెంచరీలు చేయడం.. ద్వి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత జట్టుకు తిరుగులేకుండా పోయింది..
మ్యాచ్ ఎలాగూ డ్రా అవుతుందని ఇంగ్లాండ్ ప్లేయర్లు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మ్యాచ్ ను డ్రా గా ప్రకటిద్దామని ఇండియన్ ప్లేయర్ల వద్దకు వచ్చాడు. దానికి రవీంద్ర జడేజా ఒప్పుకోలేదు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న గిల్ మైదానంలో జరుగుతున్న వ్యవహారం మొత్తాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఫీల్డర్లను సర్కిల్లో మోహరించాడు. దీంతో భారత బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ రూట్ బౌలింగ్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి తన టెస్ట్ కెరియర్లో తొలి శతకాన్ని సాధించాడు. దీంతో భారత్ రెండవ ఇన్నింగ్స్ లో 425 పరుగులు చేసింది.. భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం.. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కున్న తీరు అద్భుతం.. అనన్య సామాన్యం. స్టోక్స్ ను ఎదుర్కోవడంలో కెప్టెన్ గిల్ ఇబ్బంది పడితే.. వాషింగ్టన్ సుందర్ మాత్రం ఎక్కడా లేని పరిణీతి ప్రదర్శించాడు. అతడు గనుక అదే జోరు కొనసాగిస్తే తిరుగు ఉండదు.. వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులను టీమిండియా చేస్తే.. ఇంగ్లాండ్ 669 పరుగులు చేసింది. 311 పరుగుల లీడ్ సాధించింది. వాస్తవానికి పరుగులేమీ చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. మూడు, ఇదో వికెట్ (అజేయంగా) కు అద్భుతమైన భాగస్వామ్యాలు నమోదు చేసింది.. మూడో వికెట్ కు 188, ఐదో వికెట్ కు 203 పరుగులు జోడించడంతో భారత్ అత్యంత పటిష్ట స్థితిలోకి వెళ్లిపోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయలేకపోయిన భారత బ్యాటర్లు.. రెండవ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు తేలిపోయినప్పటికీ మిగతా ఆటగాళ్లు అదరగొట్టారు.