YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ శ్రేణులు చాలా ఆందోళనతో ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై జరుగుతున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. సంక్షేమ పథకాన్ని ఒక్కొక్కటి అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల అమలులో పురోగతి కనిపిస్తోంది. ఇటీవల డీఎస్సీ నియామకం పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలను నియమించే పనిలో ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేయడంతో ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ నుంచి వైసీపీ పై ఎదురుదాడి ప్రారంభమైంది. అయితే దానిని తిప్పి కొట్టడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండకపోవడంపై పార్టీ శ్రేణుల నుంచి విస్మయం వ్యక్తం అవుతోంది.
Also Read: చంద్రబాబు విషయంలో తప్పుతున్న జగన్ అంచనా!
బెంగళూరుకు పరిమితం..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ఎక్కువగా బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. అక్కడ ఎలహంక ప్యాలెస్ కు మాత్రమే పరిమితం అవుతున్నారన్న విమర్శ ఉంది. వారంలో మూడు రోజులపాటు తాడేపల్లికి వస్తున్నారన్న సమాచారంతో.. అక్కడకు వెళ్తున్న వైసీపీ నేతలకు షాక్ తగులుతోంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి జాడ లేకపోవడంతో.. ఆయన ఎక్కడ ఉంటున్నారు అని ప్రశ్నించిన వారే అధికం అవుతున్నారు. అసలు పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా జగన్ బెంగళూరుకి ఎందుకు పరిమితం అవుతున్నారన్న ప్రశ్న సొంత పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇలా అయితే కష్టం అని చెబుతున్న వారు కూడా ఉన్నారు.
ఇలా వచ్చి అలా వెళ్లి..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా( social media) వేదికగా అనేక ప్రకటనలు ఇస్తున్నారు. అయితే అది తాడేపల్లి ప్యాలెస్ నుంచా.. లేకుంటే బెంగళూరు నుంచా పార్టీ శ్రేణులు. మీడియా ముందుకు వచ్చి అధికార కూటమిపై ఆరోపణలు చేసి మాయమవుతున్నారు జగన్. చివరి ఏడాదిన్నరలో చూసుకుందాంలే అన్న రీతిలో ఉన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల కంటే.. అధికార పార్టీ వైసీపీపై చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది. దానిని గుర్తించి అధినేతకు చెప్పాలని సీనియర్లు భావిస్తున్నారు. కానీ వారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి దొరకడం లేదు. అసలు ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు.
Also Read: దువ్వాడ ప్లాన్ వర్కౌట్!
జిల్లాల పర్యటన ఎప్పుడు
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఎప్పుడో సంక్రాంతికి ముందు ప్రజల్లోకి వస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు పండుగలు దాటి పోతున్నాయి కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి వచ్చింది చాలా తక్కువ. మధ్య మధ్యలో పార్టీ నాయకుల పరామర్శకు వస్తున్నారు. జైల్లో ఉన్నవారికి పరామర్శించి వెళ్తున్నారు. కానీ జిల్లాల పర్యటనకు మాత్రం శ్రీకారం చుట్టడం లేదు. కనీసం పార్టీలో జరుగుతున్న లోపాలు, వైఫల్యాలు చెప్పుకునేందుకు వస్తున్న సీనియర్లకు సైతం కనిపించనంత బిజీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలా అయితే కష్టమని సొంత పార్టీ సీనియర్లే వ్యాఖ్యానించే పరిస్థితికి చేరుకుంది.