Homeఆంధ్రప్రదేశ్‌Revanth Reddy : ఉన్నట్టుండి.. చంద్రబాబు, వైఎస్సార్ పై రేవంత్ రెడ్డికి ఎందుకింత ప్రేమ?!

Revanth Reddy : ఉన్నట్టుండి.. చంద్రబాబు, వైఎస్సార్ పై రేవంత్ రెడ్డికి ఎందుకింత ప్రేమ?!

Revanth Reddy :  అయితే ఈ పరిణామాలను రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. పైగా తన అలవాటైన రీతిలోనే మాట్లాడుకుంటూ పోయాడు. వాస్తవానికి తెలుగు సభల పేరుతో వేడుకలు జరుపుతున్నప్పటికీ.. తొలి రోజు చంద్రబాబును ఆహ్వానించిన నిర్వాహకులు.. ఆ వేడుకలు నిర్వహిస్తున్న తెలంగాణలో.. తెలంగాణ ముఖ్యమంత్రిని రెండవ రోజు ఆహ్వానించడం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. సరే ఇన్ని విషయాలను పక్కనపెట్టి రేవంత్ రెడ్డి తెలుగు సభలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. ప్రారంభ ప్రసంగం ఒకప్పటి సినిమా నటుడు బాలాదిత్య చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి.. కిరణ్ కుమార్ రెడ్డి అనేశాడు.. అంత పెద్ద సభ నిర్వహించినప్పుడు.. ఆ స్థాయిలో అతిరథ మహారధులు హాజరైనప్పుడు ఇలాంటి బీ గ్రేడ్ వ్యక్తులకు వ్యాఖ్యాత స్థానం ఎందుకు ఇస్తారో నిర్వాహకులకే తెలియాలి.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మూడు రోజులపాటు ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలు జరిగాయి. ముగింపు సభలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సహజంగానే ఈ వేదికపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. తెలుగువారికి అతని గొప్పగా పేర్కొన్నారు. కెసిఆర్ పేరు లేకుండా జాగ్రత్త పడుతూనే.. తెలుగువారి గౌరవ ప్రతిష్టలను పెంచిన వ్యక్తులను ప్రస్తావించారు. పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, జస్టిస్ ఎన్వి రమణ, నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, వెంకయ్య నాయుడు.. ఇంకా చాలామంది పేర్లను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. అంతేకాదు వారు తెలుగు జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఢిల్లీలో చట్టసభల్లో వారు మాట్లాడిన మాటలను ప్రస్తావించారు.

ఆ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపి, ఇతర పార్టీలు సహకరించాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి, టిడిపి కి కాస్త గ్యాప్ ఏర్పడింది. టిడిపి కూటమి ఎన్డీఏలో చేరడం.. కాంగ్రెస్ పార్టీ యూపీఏ లో ఉండడంతో రాజకీయంగా కాస్త విభేదాలు చోటుచేసుకున్నాయి. అయితే వారందరినీ కూల్ చేయడానికి.. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎన్టీ రామారావు, చంద్రబాబు పేర్లను ప్రస్తావించారు. హైదరాబాద్ నగరానికి వారు చేసిన సేవలను వివరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో వారు తీసుకొన్న నిర్ణయాలను పేర్కొన్నారు. దీంతో రేవంత్ రెడ్డి 2023 నాటి పరిస్థితులను తీసుకొచ్చారని.. ఆయన ప్రసంగం ఆకట్టుకుందని టిడిపి నేతలు అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు పేర్లను ప్రస్తావించడం తమకు ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.. మరోవైపు తెలంగాణలో వైఎస్ అభిమానులు కూడా.. రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular