Dil Raju : కొన్నేళ్లుగా శంకర్ ని వివాదాలు వెంటాడుతున్నాయి. అపరిచితుడు చిత్రాన్ని ఆయన హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ మూవీ నిర్మాతలతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. రణ్వీర్ సింగ్ తో చేయాలనుకున్న ఆ చిత్రం ఆగిపోయింది. 1996లో కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్ నిజానికి దిల్ రాజు చేయాల్సింది. బడ్జెట్ లెక్కలు చూశాక ఆయన తప్పుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
షూటింగ్ మొదలయ్యాక వారితో విబేధాలు తలెత్తాయి. భారతీయుడు 2 సెట్స్ లో ప్రమాదం జరిగి, ప్రాణనష్టం చోటు చేసుకుంది. ఇతర కారణాలతో భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది. ఆ సినిమా పక్కన పెట్టి శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. లైకా ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించారు. షూటింగ్ మొదలుపెట్టిన మా చిత్రాన్ని మధ్యలో వదిలేసి గేమ్ ఛేంజర్ మూవీ చేయడం నేరం అంటూ వారు ఆరోపణలు చేశారు. చేసేది లేక భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేశాడు శంకర్.
అయితే ఫుటేజ్ ఎక్కువ రావడంతో భారతీయుడు 3 కూడా చేయాలన్నట్లు కథ ముగించాడు. భారతీయుడు 2 డిజాస్టర్ అయ్యింది. నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ గేమ్ ఛేంజర్ విడుదలను అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో గేమ్ ఛేంజర్ విడుదల చేయడానికి వీల్లేదు. భారతీయుడు 3 పూర్తి చేసి విడుదల చేశాకే.. గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో శంకర్, దిల్ రాజులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
జనవరి 10న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. అధికారిక ప్రకటన కూడా జరిగింది. తమిళనాడులో గేమ్ ఛేంజర్ విడుదలకు ఆటకం ఏర్పడితే కొంత మేర నష్టం తప్పుడు. ఈ రోజుల్లో ఓ చిత్రానికి బిజినెస్ ఒకటి రెండు వారాలు మాత్రమే. పొరపాటున నెగిటివ్ టాక్ వస్తే గేమ్ ఛేంజర్ మూవీ తమిళ వెర్షన్ అనంతరం చూసే నాథుడు ఉండడు. తమిళ డిస్ట్రిబ్యూటర్స్ సైతం తమ డబ్బు వెనక్కి అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ కి జఠిల సమస్య ఎదురైంది. శంకర్ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి..
Web Title: An unexpected shock for dil raju the game changer in kollywood just after the release of indian 3
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com