Homeఆంధ్రప్రదేశ్‌AP Media: ఆ రెండు పత్రికలు ఎందుకు అంత దిగజారాయి?

AP Media: ఆ రెండు పత్రికలు ఎందుకు అంత దిగజారాయి?

AP Media: ప్రత్యర్థి బలమైన నేత, ప్రజా బలం ఉన్న వ్యక్తి అయితే.. అతడిని ఓడించడం అంత ఈజీకాదు. కానీ, బలమైన వ్యక్తిని కూడా ఎలా ఓడించాలో రెండు తెలుగు దినపత్రికల యజమానులు రామోజీనావు, రాధాకృష్ణకు బాగా తెలుసు. తమకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తేవడానికి, తమకు వ్యతిరేకమైన వారిని గద్దె దించడానికి ఎంతకైనా తెగిస్తారు. నాటి ఎన్టీఆర్‌ నుంచి నేటి జగన్‌మోహన్‌డ్డి వరకు ఇదే విధానం అవలంబిస్తున్నాయి. ఇందుకు తాజాగా ఆ రెండ పత్రికలు ఏపీ ప్రభుత్వంపై రాస్తున్న దిగజారుడు వార్తలే నిదర్శనం అంటున్నారు రాజకీయ నిపుణులు.

నాడు ఎన్టీఆర్‌ విషయంలో..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు. ప్రజాబలంలో కేవలం పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలమైన నేతగా ఎదిగాడు. కేంద్రంలోనూ చక్రం తిప్పాడు. అయితే 1996 ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ.రామారావును గద్దె దించడానికి ఆ రెండు పత్రికల యాజమాన్యాలు నందమూరి అల్లుడు, నాటి టీడీపీ మంత్రి చంద్రబాబుతో చేతులు కలిపాయి. దీంతో ఎన్టీఆర్‌ను స్త్రీలోలుడు, డ్రగిస్ట్‌ అని ముద్రవేసి ప్రజల్లో చులకన చేశాయి. పార్టీపై పట్టు కోల్పోయాడు. మహిళల మాయలో పడ్డాడు అని ప్రచారం చేశాయి. ఇందుకు సొంత కుటుంబ సభ్యులు కూడా నమ్మేలా చేశాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడివైపు తిప్పి ›పభుత్వాన్ని కూల్చేలా చేశాయి.

వైఎస్సార్‌ విషయంలోనూ..
ఇక ౖÐð ఎస్‌.రాజశేఖరరెడ్డి అంటే కూడా ఆ పత్రికలకు నచ్చదు. చంద్రబాబు మినహా ఎవరూ రాష్ట్రంలో అధికారంలోకి రాకూడదని భావించిన పత్రికలు చంద్రబాబును అనుకూలంగా, ప్రతిపక్ష నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా కథనాలు రాశాయి. రాజశేఖరరెడ్డి బలం పెరుగుతుండడంతో అతడిని ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించాయి. కానీ ప్రజలు వాటిని పట్టించుకోలేదు. 2004లో, 2009 అధికారంలోకి తీసుకువచ్చారు. 2009లో బలం తగ్గినా.. అధికారం మాత్రం నిలబెట్టుకున్నారు వైఎస్సార్‌.

ఇప్పుడు జగన్‌పై..
ఇక ఇప్పుడు చంద్రబాబు కోసం జగన్‌ వెంట పడ్డాయి ఆ పత్రికలు. 2019లో జగన్‌ అధికారంలోకి రాకుండా చేసేందుకు, అతడి కేసులపై తిప్పితిప్పి కథనాలు రాశాయి. కానీ, ప్రజలు జగన్‌వైపే నిలిచారు. ఇక మరోమారు ఎన్నికలో రాబోతుండడంతో మళ్లీ జగన్‌ ›ప్రభుత్వంపై కథనాలు వండి వారుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను అప్పలు ఊబిలోకి నెట్టాడని ఆరోపిస్తున్నాయి అప్పుల అప్పారావులు అంటూ జగన్, బుగ్గన రాజేంద్రనాథ్‌పై వార్తలు రాశాయి. రాస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పత్రికా యజమానుల లక్ష్యం జగన్‌ను ఓడించి చంద్రబాబును సీఎం చేయడమే.

కేసీఆర్‌ విజయంలో ఉదాసీనత..
కేసీఆర్‌ తెలంగాణ సీఎం అయ్యాక లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. తెచ్చిన అప్పులతో తాను, తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడని కూడా ఆరోపించారు. కానీ, ఆ రెండు పత్రికలు మాత్రం వాటిపై వార్తలు, కథనాలు రాయడం లేదు. ఎందుకంటే కేసీఆర్‌ తాను ఆక్రమించిన స్థలాలను లాగేసుకుంటాడని భయపడ్డారు. ఇప్పుడు రేవంత్‌ తమ మాట వినే నాయకుడు అని కథనాలు రాయడానికి వెనుకాడుతున్నారు.

ఇలా రాజకీయాలను ఆ రెండు పార్టీలు శాసించాలని చూస్తున్నాయి. మరి వీరు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్‌ అవుతారో.. వీరి కథనాలను ప్రజలు ఏమేరకు నమ్ముతారో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular