TTD: టీటీడీ అధ్యక్ష పీఠం ఎవరికో? కొత్తగా తెరపైకి సినీ ప్రముఖులు!

జనసేన అధ్యక్షుడు పవన్ సోదరుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది.ఆయనకు టిటిడి అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ నడిచింది. అందుకే ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు ఈసారి దూరంగా ఉన్నారని కూడా అంతా భావించారు. కానీ తరువాత ఆయన సుముఖంగా లేరని.. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని క్లారిటీ వచ్చింది. తరువాత అశోక్ గజపతిరాజు పేరు బలంగా వినిపించింది. టిడిపి ఆవిర్భావం నుంచి విశేష సేవలందించారు అశోక్. చంద్రబాబుకు నమ్మిన బంటు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

Written By: Dharma, Updated On : July 10, 2024 1:48 pm

TTD

Follow us on

TTD: టీటీడీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది?ఎవరి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారు? జనసేనకు కేటాయిస్తారా? లేకుంటే బీజేపీ డిమాండ్ చేస్తోందా?అసలు ఆ రెండు పార్టీలకు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు ఉందా?లేకుంటే టీడీపీ తరఫున ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.టీటీడీ అధ్యక్ష పీఠం అంటే..క్యాబినెట్ హోదా కంటే ఎక్కువ.ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పీఠం అంటే ప్రతి ఒక్కరికీ మక్కువే. అందుకే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. తమ సన్నిహితులను మాత్రమే అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. అందరి దృష్టి టీటీడీ అధ్యక్ష పీఠంపై పడింది.

జనసేన అధ్యక్షుడు పవన్ సోదరుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది.ఆయనకు టిటిడి అధ్యక్షుడిగా నియమిస్తారని టాక్ నడిచింది. అందుకే ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు ఈసారి దూరంగా ఉన్నారని కూడా అంతా భావించారు. కానీ తరువాత ఆయన సుముఖంగా లేరని.. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని క్లారిటీ వచ్చింది. తరువాత అశోక్ గజపతిరాజు పేరు బలంగా వినిపించింది. టిడిపి ఆవిర్భావం నుంచి విశేష సేవలందించారు అశోక్. చంద్రబాబుకు నమ్మిన బంటు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టిడిపి ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అశోక్ గజపతి పోటీ చేశారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన ప్రతిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయని ఆయనకు గౌరవప్రదమైన పదవీ విరమణ చూపాలని చంద్రబాబు భావిస్తున్నారు. టీటీడీ అధ్యక్ష పీఠం అప్పగిస్తారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

మరోవైపు సినీ పరిశ్రమ నుంచి అశ్వినిదత్ తో పాటు మురళీమోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన అశ్విని దత్ ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు చాలా అభిమానం. ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. మరోవైపు మురళీమోహన్ టిడిపిలో సీనియర్. 2009 ఎన్నికల్లో తొలిసారిగా రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి లక్షా డెబ్భై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కోడలితో పోటీ చేయించారు. అయినా ఓటమి ఎదురైంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనా.. టిడిపి కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన సైతం స్వామివారి సేవను కోరుతున్నారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.