https://oktelugu.com/

Chittoor: శ్రీలంక – భారత్ ఒకప్పుడు కలిసి ఉండేవా.. ఈ కప్పే అందుకు అని నిదర్శనమా?

శ్రీలంక ప్రాంతంలో శ్రీలంకన్ "స్యూడో ఫిలెటస్ రిజియస్" అనే కప్ప కనిపిస్తుంది. దీని జీవవైవిధ్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది సంవత్సరం మొత్తంలో కేవలం ఒక నెల మాత్రమే బయటికి వస్తుంది. మిగతా కాలం మొత్తం సుప్త చేతనావస్థలో ఉంటుంది. ఇది తన శరీరంపై తేమను కాపాడుకునేందుకు చిన్న చిన్న బొరియలు చేసుకుంటూ జీవిస్తుంది. సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆహార అన్వేషణ చేసి.. దానిని జాగ్రత్తగా దాచుకొని తింటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 10, 2024 / 02:05 PM IST

    Chittoor

    Follow us on

    Chittoor: భారత దేశానికి ఎన్నో పొరుగు దేశాలతో సరిహద్దు ఉన్నప్పటికీ.. శ్రీలంకతో మాత్రం అనుబంధం ప్రత్యేకం. శ్రీలంకకు భారతదేశానికి మధ్య బంగాళాఖాతం ఉంది. దీని మీద గానే ఒకప్పుడు శ్రీరాముడు వారధి నిర్మించి లంకకు వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీలంకలో రావణుడిని సంహరించి సీతాదేవిని తీసుకొచ్చాడట. నాడు రాముడు నిర్మించిన రామసేతు అప్పట్లో నాసా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉంటారు. తమిళనాడు ప్రాంతం వారితో లంకేయులకు బంధుత్వం ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో శ్రీలంక – భారత్ వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒకప్పుడు ఈ ప్రాంతాలు కలిసే ఉండేవట. దానిని బలపరుస్తూ ఓ జీవి కనపడింది.

    శ్రీలంక ప్రాంతంలో శ్రీలంకన్ “స్యూడో ఫిలెటస్ రిజియస్” అనే కప్ప కనిపిస్తుంది. దీని జీవవైవిధ్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది సంవత్సరం మొత్తంలో కేవలం ఒక నెల మాత్రమే బయటికి వస్తుంది. మిగతా కాలం మొత్తం సుప్త చేతనావస్థలో ఉంటుంది. ఇది తన శరీరంపై తేమను కాపాడుకునేందుకు చిన్న చిన్న బొరియలు చేసుకుంటూ జీవిస్తుంది. సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆహార అన్వేషణ చేసి.. దానిని జాగ్రత్తగా దాచుకొని తింటుంది. ఈ జీవికి చీమలకు దగ్గర సంబంధం ఉంటుంది.. అయితే ఈ తరహా కప్పలు ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం కొండల్లో కనిపించాయి.

    “స్యూడో ఫిలెటస్ రిజియస్” కప్పలు నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. శ్రీలంక ఒక ద్వీప దేశం కాబట్టి.. అక్కడ నీరు ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ కప్పలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కపలు శేషాచలం కొండల ప్రాంతంలో కనిపించడంతో.. ఒకప్పుడు శ్రీలంక – భారతదేశంలోని తమిళనాడు, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలు కలిసే ఉండేవన్న వాదనకు బలం చేగుతుంది. “శ్రీలంక భారత భూభాగాలు కలిసే ఉండేవి. అందుకు నిదర్శనమే “స్యూడో ఫిలెటస్ రిజియస్” కప్ప. ఇది నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంది. భారతదేశంలోని నెల్లూరు, చిత్తూరు, శ్రీలంక కలిసే ఉండేవి. కాలక్రమంలో శ్రీలంక దేశంగా, చిత్తూరు, నెల్లూరు భారతదేశంలో భాగంగా మారిపోయాయి. మనదేశంలో “స్యూడో ఫిలెటస్ రిజియస్” కప్పలు ఎక్కడా కనిపించవు. కానీ చిత్తూరు ప్రాంతంలోనే దర్శనమిస్తున్నాయంటే దానికి కారణం భౌగోళికంగా శ్రీలంక వాతావరణం, ఇక్కడి వాతావరణం ఒకే విధంగా ఉండటమేనని” జీవ వైవిధ్య మండలి పరిశోధకులు చెబుతున్నారు.