Jamily Election Effect: జమిలి ఎన్నికలు.. ఏపీ పై ప్రభావం ఎంత?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా 1700 రోజుల సమయం ఉంది. ఇంతలో కేంద్రం జమిలి కి ప్లాన్ చేస్తోంది. దీంతో కూటమి ఆయుష్షు తగ్గుతుందా? వైసీపీకి ఛాన్స్ దక్కుతుందా? అన్న టాక్ ప్రారంభమైంది.

Written By: Dharma, Updated On : September 20, 2024 2:00 pm

Jamily Election Effect

Follow us on

Jamily Election Effect: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.ఒకే దేశం- ఒకే ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంటులోనూ ఈ మేరకు బిల్లు పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. తద్వారా ఇండియా కూటమి కూడా వ్యతిరేకమైన సంకేతాలు పంపించింది. అయితే దేశంలో మిగతా రాజకీయ పార్టీలతో పాటు ఏపీలో రాజాగా ఎన్నికైన ఎన్డీఏ సర్కార్లో భాగస్వామ్యులైన టిడిపి, జనసేన, బిజెపిలో సైతం టెన్షన్ కనిపిస్తోంది.అయితే వైసిపి మాత్రం కొంత ఊరట చెందుతోంది. పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే.. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి. అయితే ఐదేళ్లలో ఎప్పుడైనా ఇవి జరిగే అవకాశం ఉంది. అయితే తాజాగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్ర తాజా ప్రతిపాదనతో కూటమి ప్రభుత్వం పూర్తి కాలం అధికారం చెలాయించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందస్తుకు వెళితే కూటమి పార్టీలతో పాటు విపక్ష వైసిపి ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అందుకే ఐదేళ్లపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందస్తుకు వెళ్లాలన్న ఆలోచన చేస్తే మాత్రం.. అనుసరించాల్సి ఉంటుంది.

* మారనున్న సమీకరణలు
ఒకవేళ ఏపీలో ముందస్తు ఎన్నికలు అనివార్యం అయితే రాజకీయాలు మారే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా మూడు పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వైసీపీ నుంచి జనసేనలోకి నేతల చేరిక భారీగా ఉంది. అటు టిడిపిలోకి సైతం నేతలు చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే మధ్యంతర ఎన్నికలకు వస్తే ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. మూడు పార్టీలు సుదీర్ఘంగా కలిసి ప్రయాణిస్తాయని ఇప్పటికే చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ప్రకటించారు. ఇవి ముందస్తు ఎన్నికల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలేనని ఇప్పుడు తెలుస్తోంది.

* ప్రత్యేక వ్యూహంతో జనసేన
ప్రస్తుతం జనసేన ప్రత్యేక వ్యూహంతో ఉంది. వేగంగా బలం పెంచుకోవాలని చూస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు, జనసేన ప్రాతినిధ్యం.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వైసీపీ నుంచి నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిడిపి మాత్రం బిజెపితో కలిసి ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతోంది. అదే సమయంలో బిజెపి ఎలాంటి వ్యూహంతో ఉందో తెలియని పరిస్థితి. కానీ జనసేనతో కలిస్తేనే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలమన్న ఆలోచనతో బిజెపిలో ఉంది.

* వైసీపీలో చిగురిస్తున్న ఆశలు
మరోవైపు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వైసీపీలో ఆశలు రేగుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ ముందస్తు ఎన్నికలు వస్తే వైసిపి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా? లేదా? అన్నది అనుమానం. ఇప్పటికే పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. సీనియర్లు సైతం పార్టీకి దూరమయ్యారు. ప్రతిరోజు పార్టీని వీడుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఒకవేళ మద్యంతర ఎన్నికలు వచ్చినా.. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపికి అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప.. మరొకటి కాదన్న అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికైతే కేంద్రం జమిలి ఎన్నికల ప్లాన్ తో.. ఏపీలో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.