NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన సినిమాలు ఆయనకి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. ఇక మొత్తానికైతే ఆయనకు ఉన్న క్రేజ్ వల్లే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకోవడానికి ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన ‘దేవర ‘ సినిమాతో ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు బాలీవుడ్ లో భారీ క్రేజీనైతే సంపాదించుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ లో అయితే తను ఎలివేట్ అవ్వలేకపోయాడు. కాబట్టి ఈ సినిమాతో సోలోగా వచ్చి స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద జనాల్లో నెగిటివ్ టాక్ అయితే వస్తుంది.
కానీ ఇప్పుడనే కాదు ఎన్టీఆర్ ఏ సినిమా చేసిన కూడా మొదట దానికి నెగిటివ్ టాక్ అనేది వస్తు ఉంటుంది. కారణం ఏంటి అనే విషయం క్లారిటీగా తెలియదు కానీ ఎన్టీఆర్ సినిమాకి మొదట్లో నెగిటివ్ టాక్ రావడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే కొంతమంది కావాలనే ఇలాంటి నెగటివ్ ప్రచారం చేస్తున్నారా? లేదంటే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చడం లేదా వాళ్లే కావాలని ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారా?
అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సక్సెస్ లను అందుకుంటున్నప్పటికీ క్రేజ్ పరంగా మాత్రం మిగతా హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను దక్కించుకోలేకపోతున్నాడు. ఇక మీదట వచ్చే సినిమాలతో అయిన భారీ సక్సెస్ ని అందుకొని మంచి క్రేజ్ ను సంపాదించుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక దేవర సినిమా రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్టుని పట్టాలెక్కించే పనిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ సినిమా మీద భారీ ఆయన భారీ అంచనాలైతో పెట్టుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ను అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…