https://oktelugu.com/

YCP: సాయిరెడ్డి సరే.. మిగతా ఆ నలుగురి పరిస్థితి ఏంటి? వైసీపీలో చర్చ అదే

విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) బయటకు వెళ్లారు. ఓకే గుడ్. మిగతా వారి పరిస్థితి ఏంటి. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ ఇదే.

Written By: , Updated On : January 27, 2025 / 11:12 AM IST
YCP Party

YCP Party

Follow us on

YCP: వైసీపీకి ( YSR Congress )చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పదుల సంఖ్యలో నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైసీపీలో మంచి మంచి పదవులు అనుభవించిన వారు సైతం తమ దారి తాము చూసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అందుకోసమే తాను రాజీనామా చేసినట్లు కూడా బాహాటంగా ప్రకటించారు. అయితే తనతోపాటు సాగుకు సాయం చేసేందుకు ఎంతమంది నేతలను తీసుకెళ్తారని ఇప్పుడు వైసీపీలో సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీని వీడిన నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండేవారే. అయితే విజయసాయిరెడ్డి తెర వెనుక రాజకీయాలు చేసేవారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం తక్కువ. ప్రజలతో నేరుగా అటాచ్మెంట్ చాలా తక్కువ. పార్టీ వ్యూహాలు, తెర వెనుక రాజకీయాల్లో మాత్రం అంతకుమించి ఎక్కువ అన్నట్టు ఉండేవారు. అదే సమయంలో విజయసాయి రెడ్డి లాంటి వారి వల్ల పార్టీకి ఎటువంటి ఎదుగుదల కనిపించడం లేదన్న వాదన కూడా ఉంది. అదే సమయంలో జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది.

* సీనియర్లలో అదే బాధ
జగన్( Jagan Mohan Reddy) కోటరీలో ముఖ్యుడు విజయసాయిరెడ్డి. అటు తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లాంటి వారు ఉన్నారు. అయితే వైసిపిలో వీరికి దక్కే ప్రాధాన్యం.. మరి ఏ ఇతర నేతలకు లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో సమకాలీకులైన చాలామంది నేతలు వైసీపీలో ఉన్నారు. వైయస్సార్ మాదిరిగా జగన్ సైతం తమను గౌరవిస్తారని వారు భావించారు. కానీ వారికి గౌరవం దక్కకపోగా.. ఈ కోటరికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే వైసీపీకి ఓటమి ఎదురుకావడంతో ఈ కోటరి గురించి నేరుగా జగన్ కే ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ టీంలో కీలకమైన విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోవడం.. వ్యవసాయం చేసుకుంటానని చెబుతుండడంతో.. మిగతా కోటరీ నేతలను సైతం వ్యవసాయం లో సాయం కోసం తీసుకువెళ్లిపోండి అంటూ వైసీపీ సీనియర్ల నుంచి సెటైర్లు పడుతున్నాయి.

* సామాన్య ఎమ్మెల్యేలకు ఛాన్స్ లేదు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం గా ఉన్న జగన్ ను కలవాలంటే సామాన్య ఎమ్మెల్యేకు వీలుపడేది కాదు. అప్పటి క్యాబినెట్ మంత్రులకు( cabinet ministers) సైతం సీఎం జగన్ కలవాలంటే ప్రహసనమే. మధ్యలో సీఎంఓలో కీలక పాత్ర పోషించే ధనంజయ రెడ్డి.. తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి.. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లాంటి నేతల పర్మిషన్ తప్పకుండా అవసరం. ఒకానొక దశలో అప్పటి మంత్రి రాజన్న దొర.. ఎన్నికల అనంతరం ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉండేదని.. అదే విషయాన్ని చెప్పేందుకు జగన్ ను కలవాలనుకున్నానని.. కానీ నాకు చాన్స్ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజన్న దోరే కాదు చాలామంది నేతలది ఇదే అభిప్రాయం. అందుకే ఆ కోటరీ బద్దలు కావాలన్నది సగటు వైసీపీ శ్రేణుల అభిప్రాయం.

* వారిని బయటకు పంపాల్సిందే
విజయసాయిరెడ్డి సరే.. సజ్జల రామకృష్ణారెడ్డి ( sajjala Ramakrishna Reddy )పరిస్థితి ఏంటి? ఆయన సైతం బయటకు వెళ్ళిపోతే పీడ విరగడవుతుంది.. అన్నవారే వైసీపీలో అధికం. జగన్ చుట్టూ ఉన్న ఆ నలుగురు తీరును వైసీపీలో ఉండే ప్రతి ఒక్కరు అసహ్యించుకుంటున్నారు. ఒక విధంగా విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడానికి ఎక్కువ మంది ఆహ్వానిస్తున్నారు. అలాగే మిగతావారు పార్టీ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతారా? ఆ స్క్రాప్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎక్కువమంది వైసిపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒంటరి పోరాటం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి తల్లితో బయటకు వచ్చిన ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయస్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే సాహసానికి సిద్ధంగా ఉండాలని.. కోటరీని దూరం చేయాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి.