TV9 Rajinikanth: టీవీ9 రజినీకాంత్‌కు ఏమైంది.. కేసులు పెట్టేస్తున్న న్యూస్‌ రీడర్‌!

మీడియా హుందాగా ఉండాలి. కానీ ఆ హుందాతనం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో పోయింది. రాజకీయ ముసుగు కప్పుకుని జర్నలిజం విలువలు గాలికి వదిలేసి మీడియా సంస్థలు పార్టీలకు, పాలకులకు కొమ్ము కాస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : November 8, 2023 2:34 pm

TV9 Rajinikanth

Follow us on

TV9 Rajinikanth: టీవీ9 అంటే ఒకప్పుడు రవి ప్రకాశ్‌.. సంచలనాల కోసం వార్తలు, వీడియోలు ప్రచారం చేసి ఛానెల్‌కు మంచి హైప్‌ తెచ్చాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో తెలంగాణలో అధికార పార్టీతో చెడింది. దీంతో ముఖ్యమైన మంత్రి రంగంలోకి దిగి టీవీ9 నుంచి రవి ప్రకాశ్‌ నుంచి లాక్కున్నాడు. తర్వాత మైహోం చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు టీవీ9లో రవిప్రకాశ్‌ స్థానాన్ని రజినీకాంత్‌ ఆక్రమించాడు. ఇంతవరక బాగానే ఉంది. కానీ, రజినీకాంత్‌కు సడెన్‌గా ఏమైందో ఏమో.. తన వీడియోలను కించపరిచారని కేసులు పెట్టిస్తున్నారు. ఇటీవల మహాసేన రాజేశ్‌పై కేసు పెట్టారు. ఎందుకంటే.. ఆయన తన వీడియోలతో కించపరిచారట.

టీవీ9పై ఎన్నికేసులు పెట్టాలి..
రజినీ ఫిర్యాదు నిజమే అనుకుందాం. ఇలా పోలసులు కేసులు పెడితే.. అదే టీవీ9పై రోజుకు పది కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే.. అధికార బీఆర్‌ఎస్‌కు కొమ్ము కాస్తున్న టీవీ9 రజినీకాంత్‌ గులాబీ నేతలకు అనుకూలంగా వార్తలు, కథనాలు ప్రసారం చేయడానికి విపక్ష నేతలపై అవమానకరంగా వీడియోలు, ఫొటోలు వేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ యజమానుల మెప్పు కోసం వారి రాజకీయ ప్రత్యర్థుల్ని కించపర్చడం ఇష్చం వచ్చినట్లుగా రాతలు రాయడం.. ప్రసారాలు చేయడం కొనసాగుతోంది. ఇలాంటి కేసులు పెడితే.. రజనీతాంత్‌ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది.

బురదలో రాళ్లు వేయడమేనా..
మీడియా హుందాగా ఉండాలి. కానీ ఆ హుందాతనం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో పోయింది. రాజకీయ ముసుగు కప్పుకుని జర్నలిజం విలువలు గాలికి వదిలేసి మీడియా సంస్థలు పార్టీలకు, పాలకులకు కొమ్ము కాస్తున్నాయి. టీవీ9 రజినీకాంత్‌ అయితే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సూపర్‌ ఎడిటర్‌ గా పెట్టుకుని ఆయన చేయమన్న తప్పుడు ప్రచారాలన్నీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాజంలో కుల చిచ్చు పెడతామని అడ్డగోలుగా వీడియోలు చేసుకునే స్థితికి చేరింది టీవీ9. కానీ వాటిని గుర్తించకుండా తమను అవమానించారని ఇతరులపై కేసులు పెట్టాలనుకోవడం బురదలో రాయివేసినట్లే అవుతుందని సీనియర్‌ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆ బురద తిరిగి రజినీకి, టీవీ9కు అంటడం ఖాయమంటున్నారు. రజనీకాంత్‌ ం మహాసేన రాజేష్‌ పై కేసు పెట్టిన తర్వాత వ్యక్తం చేసిన స్పందన అదే.

రజినీ వివరాలు బయటకు..
రజనీకాంత్‌పై ఇప్పటికే తోటి జర్నలిస్టులు చాలా మంది పరోక్షంగా ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు.. బెంగళూరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంం ఇంకా హైదరాబాద్‌ లో చెప్పుకోలేని చీకటి దందాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివన్నీ ఆయన దగ్గర ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న వాళ్లే చెబుతున్నారు. అధికార పార్టీల కొమ్ము కాచి అందర్నీ కించపరుస్తూ బండి లాగిస్తున్నారు కానీ.. సరిపోతుంది..కానీ కేసులు కూడా పెడితే. దానికి రియాక్షన్‌గా కేసులే వస్తాయని చరిత్ర నిరూపిస్తోంది. అలా జరిగినప్పుడు జర్నలిస్టు సమాజం నుంచి కనీస స్పందన కూడా రాదు.