Kerala BJP New Committee : కేరళ బీజేపీకి రాజీవ్ చంద్రశేఖర్ నూతన సారథిగా వచ్చిన తర్వాత కొత్త కమిటీలు వేశారు. కొత్త కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా రమేష్, శోబా, సురేష్, అంటోనీ జోసెఫ్ లాంటి కీలక నేతలను నియామకం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండిపెండెంట్ ఆలోచించే నేతలను నియామకం చేశాడని అందరూ గొప్పగా చెబుతున్నారు. బీజేపీకి శోభా సురేంద్రన్ ఉండడం వల్ల 10 శాతం ఎక్కువ ఓట్లు వస్తాయి. ఆమె ప్రజా నాయకురాలిగా పేరుగాంచారు.
అనూప్ ఆంటోనీ జోసెఫ్ అనే వ్యక్తి రాజీవ్ చంద్రశేఖర్ కు క్లోజ్ నేత. ఒక ఎక్స్ డీజీపీ ఆర్ శ్రీలేఖ వైఎస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. ఎక్స్ వైస్ చాన్స్ లర్లను వైస్ ప్రెసిడెంట్స్ గా తీసుకున్నారు.
అమిత్ షా, మోడీ, నడ్డాలు క్లియర్ కట్ మెసేజ్ లు ఇచ్చారని.. రాజీవ్ కు ఎన్నికల్లో మెజార్టీ, సీట్లు, ఓట్ల శాతం పెంచడమే టార్గెట్ గా పెట్టారని .. అందుకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని తెలిసింది. టార్గెట్ ఓరియెంటెడ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. దీనివల్ల బీజేపీకి కేరళలో బలపరిచేందుకు రాజీవ్ కు అవకాశం ఇచ్చారు. డెవలప్ మెంట్ ఓరియెంటెడ్, సర్వీస్ డెవలప్ మెంట్ గా బీజేపీని మార్చబోతున్నారని సమాచారం.
కేరళ బీజేపీకి కొత్త రూపాన్నిచ్చిన రాజీవ్ చంద్రశేఖర్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.