Vizag Yoga Day Crowd: ప్రపంచ యోగా దినోత్సవానికి( world yoga day ) సంబంధించి అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఐదు లక్షల మంది పాల్గొని ఈవెంట్లో ఎక్కడా ఏ ఇబ్బందులు రాకుండా చూడాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి జనాలను తరలించాలని చూస్తున్నారు. అయితే కేవలం యోగాసనాలు వేసే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అన్ని వర్గాల నుంచి ఇప్పటికే సమీకరించారు. సామాన్య ప్రజలు, విద్యాసంస్థల విద్యార్థులు, నావికాదళం నుంచి ఉద్యోగులు, పారిశ్రామిక సంస్థలు, వీఐపీలు, వీవీఐపీలు పాల్గొనున్నారు. అయితే ఐదు లక్షల మంది లో విశాఖ జిల్లాకు చెందినవారు మూడు లక్షల 75 వేల మంది అయితే.. ఇతర జిల్లాల నుంచి ఒక లక్ష 25 వేల మందిని సమీకరించనున్నారు. వీరిని విశాఖకు రప్పించేందుకు వేలాది ఆర్టీసీ వాహనాలను వినియోగిస్తున్నారు.
పదివేల బస్సులు.
కేవలం యోగాంధ్ర( yogandhra) వేడుకలకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల నుంచి జనాలను సమీకరించనున్నారు. ఆర్టీసీ వాహనాలతో పాటు ప్రైవేటు బస్సులను సైతం ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాకు సంబంధించి 6935 వాహనాలను, అనకాపల్లి జిల్లాకు సంబంధించి 1400 వాహనాలను, విజయనగరం జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల యాభై వాహనాలను, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 550 వాహనాలను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి 500 వాహనాలను ఏర్పాటు చేశారు. పదివేలకు పైగా వాహనాల్లో ఐదు లక్షల మందిని తరలించనున్నారు.
21వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ ఆంధ్రకు హాజరయ్యే పాల్గొనేవారికి ఏర్పాటుచేసిన బస్సుల్లో ప్రయాణిస్తూ మార్గాలను పరిశీలించాము. pic.twitter.com/MJCC1ZK5al
— Bandaru Appala Naidu (@BandaruTDP) June 19, 2025
విశాఖకు ప్రాధాన్యం
విశాఖ జిల్లాల నుంచి తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖ నగరం తో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థల నుంచి 58 వేల మంది విద్యార్థులు, మూడు లక్షల మంది సాధారణ ప్రజలు, నేవీ నుంచి 12 వేల మంది, పరిశ్రమల్లో పనిచేసే వారు 5500, వివిఐపీలు మరో 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉత్తరాంధ్రలో మిగతా జిల్లాల నుంచి 1,25,000 మంది ని తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఆంధ్ర యూనివర్సిటీలో 30వేల 500 మందితో యోగా సాధన చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చే దాదాపు 25 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు నిర్వహించనున్నారు.
Also Read: Yoga Day Rules In Vizag: విశాఖ యోగా డేకు నిబంధనలు ఎంత కఠినం అంటే?
అత్యవసర సేవలు అందుబాటులోకి
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రధమ చికిత్స కేంద్రాలు 307, 50 వైద్య శిబిరాలు, పది పడకల ఆసుపత్రులు మూడు, 116 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా యోగా మ్యాట్లు మూడు లక్షల 50 వేలు పంపిణీ చేశారు. ఐదు లక్షల మందికి టీ షర్టులు అందించనున్నారు. ప్రత్యేక ఆహార ప్యాకెట్ కూడా అందిస్తారు. అందులో రెండు గ్లూకోజ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్, కేకు, చెక్కి, వాటర్ బాటిల్, అరటిపండు ఉంటుంది.
యోగా డేకు సిద్ధమవుతున్న విశాఖ సాగర తీరం
స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఈ నెల 21న ఉదయం 6.30 గంటలకు యోగా ప్రాంగణానికి చేరుకోనున్న ప్రధాని మోదీ
ప్రజల కోసం 2 వేల బస్సులు ఏర్పాటు#Chandrababunaidu #Vishakapatnam#Andhrapradesh pic.twitter.com/suCmzqLwlM
— Telugu Stride (@TeluguStride) June 16, 2025