Amardeep Latest Viral Moment: పెళ్ళైన అమర్ దీప్ ఓ షోలో చేసిన పనికి యాంకర్ శ్రీముఖి కొట్టేసింది. అనసూయ తిట్టేసింది. సీరియల్ హీరోయిన్ ని గట్టిగా హత్తుకున్న అమర్ దీప్, ఛాన్స్ దొరికింది కదా అని వదల్లేదు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..
రియాలిటీ షోలలో స్టార్ మా దూసుకుపోతుంది. ఈ ఛానల్ లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రెండేళ్లకు పైగా బుల్లితెరకు దూరమైన అనసూయ భరద్వాజ్(ANASUYA BHARADWAJ) ఈ షోతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈసారి ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర సెలెబ్స్ అబ్బాయిలు, అమ్మాయిలుగా ఏర్పడి ఈ షోలో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. సీజన్ వన్ సక్సెస్ కావడంతో సీజన్ 2(KIRAAK BOYS KHILADI GIRLS LATEST PROMO) స్టార్ట్ చేశారు. అనసూయ అమ్మాయిలకు శేఖర్ మాస్టర్ అబ్బాయిలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కి సిద్ధమైంది. కిరాక్ బాయ్స్ గెలుస్తారా లేక ఖిలాడీ గర్ల్స్ గెలుస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
కాగా లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమర్ దీప్ ఓ సీరియల్ హీరోయిన్ ని గట్టిగా హత్తుకున్నాడు. దొరికిందే ఛాన్స్ గా వదలకుండా ఒడిసిపట్టుకున్నాడు. షోలో భాగంగా స్క్రీన్ మీద ఇడియట్ మూవీ పోస్టర్ వేశారు. ఆ పోస్టర్ లో హీరోయిన్ రక్షితను హీరో రవితేజ కౌగిలించుకుని ఉంటాడు. సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ తో ఆ స్టిల్ రీ క్రియేట్ చేయమనగా… అమర్ దీప్ స్టేజ్ మీదకు వచ్చాడు. దేబ్జానీ ని అమర్ దీప్(AMARDEEP) హగ్ చేసుకున్నాడు. కాసేపు ఆమె కూడా సహకరించింది. ఎంతకీ వదలకపోవడంతో వదిలించుకునే ప్రయత్నం చేసింది.
Also Read: Amar Deep Remuneration : స్టార్ మా నుండి భారీగా ఛార్జ్ చేసిన అమర్ దీప్… ఎన్ని లక్షలు ఇచ్చారో తెలుసా?
పక్కనే ఉన్న యాంకర్ శ్రీముఖి(SREEMUKHI)… వదలరా.. వదలరా అంటూ కొట్టింది. ఇక అమర్ దీప్ తీరుకు జడ్జి అనసూయ… దొంగ సచ్చినోడా అని తిట్టింది. పెళ్ళైన అమర్ దీప్ అందమైన దేబ్జానీ హత్తుకునే ఛాన్స్ దొరకడంతో వదలకుండా అలా చేశాడు. అయితే ఇదంతా ఎంటర్టైన్మెంట్ లో భాగమే అని తెలుస్తుంది. అమర్ దీప్ సీరియల్ నటుడిగా గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్ట్ చేశాడు. మొదట్లో తడబడిన అమర్ దీప్ చివర్లో పుంజుకుని టైటిల్ రేసులో నిలిచాడు. పల్లవి ప్రశాంత్ మంచి ఆట కనబరచడంతో పాటు సింపతీ కూడా తోడు కావడంతో విన్నర్ అయ్యాడు.
అమర్ దీప్ కేవలం రన్నర్ టైటిల్ తో సరిపెట్టుకున్నాడు. అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేయడం కలకలం రేపింది. ఇక అమర్ దీప్ సీరియల్ నటి తేజస్విని ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోగా చౌదరిగారి అబ్బాయితో నాయుడిగారి అమ్మాయి టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. నటి సురేఖావాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది.