Venkatesh Romance with Rukmini Vasanth: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్(Victory Venkatesh),త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నో స్టోరీలు విన్న తర్వాత వెంకటేష్ కి ఏది నచ్చలేదు. చివరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాస్త ఖాళీగా ఉండడం తో గతం లో ఆయనకు చెప్పిన స్టోరీ గుర్తుకొచ్చి వెంకటేష్ ఫోన్ చేసి అడగ్గా, వెంటనే త్రివిక్రమ్ ఆ స్క్రిప్ట్ కి ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేసి వెంకటేష్ కి వినిపించాడు. ఆయనకు తెగ నచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం గత కొన్ని రోజులుగా మూవీ టీం మొత్తం అనేక మందిని సంప్రదించారు. కానీ చివరికి మలయాళం యంగ్ హీరోయిన్ రుక్మిణి వాసంత్(Rukmini Vasanth) ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.
దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు నెటిజెన్స్ వంకలు పెడుతున్నారు. రుక్ష్మిని వయస్సు కేవలం 28 ఏళ్ళు మాత్రమే. వెంకటేష్ కి ఇప్పుడు 64 ఏళ్ళు వచ్చాయి. వెంకటేష్ కి కూతురు వయస్సు ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి, ఆమెని హీరోయిన్ గా పెడితే జనాలు నమ్ముతారా?, త్రిష, అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ ని సంప్రదించొచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. కానీ రుక్మిణి వాసంత్ వయస్సులో చిన్న అమ్మాయే అయినప్పటికీ ఆమెకు చీర కట్టి, కాస్త మేకప్ చేస్తే వెంకటేష్ వయస్సులో ఉన్న అమ్మాయి లాగానే అనిపిస్తుందని, అందుకే ఆమెను ఏరికోరి ఎంచుకున్నారని అంటుంది. ప్రస్తుతం రుక్మిణి వాసంత్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కి ఈమె షిఫ్ట్ అవుతుందని అంటున్నారు.
రుక్మిణి వాసంత్ క్యారక్టర్ కి సంబంధించిన షూటింగ్ నవంబర్ నెలలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయట. అందుకే ఆమె డిసెంబర్ నెల నుండి అందుబాటులో ఉంటుందని అంటున్నారు. అంటే ఈ క్రేజీ కాంబినేషన్ మొదలయ్యేది జనవరి నెలలోనే. ఇకపోతే వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా మొదలు అయ్యేలోపే వెంకటేష్ ఈ సినిమాని పూర్తి చేస్తాడు. సెకండ్ హాఫ్ లో దాదాపుగా 45 నిమిషాల వరకు వెంకటేష్ చిరంజీవి తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటాడట. ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.