YS Jagan : ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ నగరం రాజధాని ప్రాంతంగా మరోసారి మారింది. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ – గుంటూరు ప్రాంతాల మధ్య నెలకొల్పిన అమరావతి నగరాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా ముంచెత్తిన వరద విజయవాడ నగరాన్ని నిండా ముంచాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు నరకం చూస్తున్నారు. శ్రీమంతులు కూడా ఆహార పొట్లాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో రాజకీయ నాయకులు అండగా ఉండాల్సింది పోయి.. వరద రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరం ఈ స్థాయిలో మునగడానికి కారణం మీరు అని కూటమి ప్రభుత్వం అంటుంటే.. అకస్మాత్తుగా వరదలు చుట్టుముట్టడానికి కారణం మీరని వైసిపి శ్రేణులు అంటున్నాయి. దీంతో పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగరం నీటిలో మునగడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వమని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు ఆయన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు.. దీంతో గత కొద్దిరోజులుగా జగన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
బుడమేరు ఉప్పొంగి ప్రవహించింది
విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో బుడమేరు ఉంటుంది. ఈసారి బుడమేరుకు ఎగువన ఉన్న ఖమ్మం నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చింది. వరద ప్రవాహం తీవ్రం కావడంతో అది కాస్త ఎన్ టీ పీ ఎస్ ను నీట ముంచుతుందని భావించి వెలగలేరు ప్రాంతంలో లాకులు ఎత్తారు. దీంతో ఆ వరద నీరు మొత్తం విజయవాడ నగరాన్ని ముంచెత్తడం మొదలుపెట్టింది. ఫలితంగా సింగ్ నగర్ నుంచి మొదలుపెడితే భవాని ద్వీపం ప్రాంతం వరకు నీట మునిగింది. పైగా ఎగువన ఉన్న ఖమ్మం నుంచి బుడమేరుకు ప్రవాహం ఎక్కువగా వస్తోంది. దీంతో ఇప్పుడప్పుడే విజయవాడ నగరం ముంపు నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే క్రమంలో బుడమేరు నీరు విజయవాడ నగరాన్ని ఎందుకు ముంచెత్తిందనే విషయాన్ని ఈనాడు స్పష్టంగా పేర్కొంది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో కూటమి ప్రభుత్వ నాయకులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఆ లాకులు ఎత్తకపోతే ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంటున్న ఇల్లు మునిగిపోయేదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయవాడ నగరం మునగడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ విధానాలేనని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.. జగన్ మాట్లాడిన మాటలు తాలూకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైసిపి శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నాయి.
జగన్ వ్యాఖ్యలపై..
దీనిపై ఇదే స్థాయిలో టిడిపి స్థాయిలో మండిపడుతున్నాయి. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. జగన్ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో బుడమేరు కాలువను ఒక్కసారి అయినా తవ్వి ఉంటే విజయవాడకు ఈ రోజున ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నాయి. అటు ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. బురద నీటిలో నరకం చూస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం.. తమలోపాలను ఎదుటి వాళ్ళ మీద రుద్ది.. విమర్శలు చేస్తుండడం విశేషం.
ఈరోజు ఈనాడు పేపర్ దయచేసి చదవండి!!
గేట్లు ఎత్తడం వల్లే విజయవాడకు ఇలా జరిగిందని ఈనాడు రాసింది.
– @ysjaganNi Intloki water Vastai Ani Prajalu Pranalatho aadukuntava @ncbn pic.twitter.com/dQxJtN8YXw
— Vamsi Reddy (@vmc_reddy) September 4, 2024