Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Retirement : విజయసాయి రిటైర్మెంట్.. ఓకే చేసిన జగన్..వైసీపీలో సంచలనం

Vijaya Sai Retirement : విజయసాయి రిటైర్మెంట్.. ఓకే చేసిన జగన్..వైసీపీలో సంచలనం

Vijaya Sai Retirement : వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసినట్టే. ఈ విషయాన్ని సీఎం జగనే స్వయంగా ప్రకటించారు. వయసురీత్యా పనికి రాడని సర్టిఫై చేశారు. గడపగడపకూ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో జగన్ వర్కు షాపు నిర్వహించారు. . సాయన్న ముసలోడు అయ్యాడు. అన్ని పనులు చేయలేడు. అందుకే అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం విజయసాయి చేతిలో కేవలం రాజ్యసభ మాత్రమే ఉంది. చేతిలో ఉన్న ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇన్ చార్జి, అనుబంధ విభాగాల సమన్వయకర్త.. ఇలా అన్ని బాధ్యతలు తొలగించారు. అంటే దాదాపు పార్టీలో విజయసాయికి స్థానం లేనట్టే అన్నమాట.

గత కొద్ది నెలలుగా పార్టీ కార్యక్రమాలకు విజయసాయి దూరంగా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో సైతం కనిపించకుండా మానేశారు. జగన్ ఢిల్లీ టూర్ లో సైతం పెద్దగా కనిపించలేదు. అటు సోషల్ మీడియా యాక్టివిటీస్ ను తగ్గించారు. దీంతో రకరకాల చర్చలు నడిచాయి. వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ ఇటీవలే రియాక్టయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి అనుబంధ విభాగాలతో రివ్యూ చేశారు. పడుకున్నది చాలూ.. ఇక యాక్టివ్ అవ్వాల్సిందే అంటూ హెచ్చరించారు. మళ్లీ ట్విట్టర్ ఖాతాను సైతం లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు. పాత పద్ధతిలో ట్విట్లు పెడుతున్నారు. అయితే జగన్ ఇప్పుడు బ్రేక్ వేశారు. ఏమీ చేయవద్దని సంకేతాలిచ్చారు.

వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచే జగన్ వెంట విజయసాయి అడుగులు వేశారు. వైసీపీ ఏర్పాటుచేసిన నాటి నుంచే యాక్టివ్ గా పనిచేశారు. జగన్ వెంట జైలుకెళ్లారు. జైలుజీవితం అనుభవించారు. గత ఎన్నికలకు ముందు జగన్ కంటే ఎక్కువ కష్టపడ్డారు. బీజేపీతో ఈ స్థాయి మైత్రికి అవసరమైన కార్యకలాపాలన్నీ విజయసాయి చూసుకున్నారు. టీడీపీతో బీజేపీ వైరం, వైసీపీతో స్నేహం కోసం తెర వెనుక పాట్లు పడింది కూడా విజయసాయే. కానీ ఇటీవల ఎక్కడో తేడా కొట్టింది. అందుకే జగన్ పక్కన పడేయడం ప్రారంభించారు. అటు విజయసాయి సైతం పక్కకు తప్పుకున్నట్టు కనిపించారు. ఇప్పుడు పార్టీలో రీయాక్టివ్ అవుతామంటూ ముసలోడు అంటూ స్వయంగా జగనే ప్రకటించి బ్రేకులు వేశారు.

జగన్ అక్రమ ఆస్తుల కేసులో విజయసాయి ఏ2 ముద్దాయి. ఈ కేసులో విజయసాయిరెడ్డి ఎక్కడా సంపాదించినట్టు సీబీఐ పేర్కొనలేదు. విజయసాయిరెడ్డి సైతం తాను లబ్ధిదారుడ్ని కానప్పుడు.. తనపై కేసులు ఎందుకు పెట్టారని కోర్టులో వాదిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ విజయసాయిరెడ్డిని దూరం పెడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఒకరకంగా ఇది సాహసం, సంచలనం కూడా. దీనిపై విజయసాయి ఎలా రియాక్టవుతారో చూడాలి. వాస్తవానికి విజయసాయిరెడ్డి కంటే పెద్ద వయసున్న నేతలు వైసీపీలో అధికం. వారందరికీ లేని నిబంధనలు, సర్టిఫై విజయసాయికే జగన్ చూపుతుండడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే పొమ్మన లేక పొగ పెట్టడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular