Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: ఈసారి విజయసాయిరెడ్డి ఏం మొక్కులు మొక్కాడబ్బా?

Vijayasai Reddy: ఈసారి విజయసాయిరెడ్డి ఏం మొక్కులు మొక్కాడబ్బా?

Vijayasai Reddy: రాజకీయాలకు( politics) గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు విజయసాయిరెడ్డి. కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని.. రాజకీయాలు చేయనని తేల్చి చెప్పారు. కానీ తరచూ రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెట్టేలా.. తాను నిందితుడిగా ఉన్న కేసుల్లో కీలక ఆధారాలు ఇస్తానని తిరిగి దర్యాప్తు సంస్థలకు ఆయన ఆఫర్ ఇస్తుండడం విశేషం. ముఖ్యంగా మద్యం కేసులో సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. అటువంటి విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించారు.

Also Read: ఎందుకు రావట్లేదు లోకేష్.. మోడీ ప్రశ్నకు కారణమేంటి?

* తిరుమలలో భక్తుల రద్దీ..
వేసవి సెలవులు( summer holidays ) కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 74,344 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అందులో 32,000 మందికి పైగా తలనీలాలు సమర్పించారు. ఒక్క రోజే హుండీ ద్వారా రెండు కోట్ల ఐదు లక్షల ఆదాయం సమకూరినట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఐదు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలుత స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.

* మీడియాతో మాట్లాడకుండానే..
అయితే స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) మీడియాతో అస్సలు మాట్లాడలేదు. మీడియా ప్రతినిధులు మాట్లాడాలని కోరినా.. ఆయన పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం లిక్కర్ కుంభకోణంలో a5 నిందితుడిగా ఆయన ఉన్నారు. రెండుసార్లు విచారణకు కూడా హాజరయ్యారు. ఆయన ఇచ్చిన వివరాలతోనే నిందితుల అరెస్టులు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నా.. విజయసాయిరెడ్డి అరెస్టు జరగదని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొద్ది నెలల కిందటే రాజీనామా చేశారు. బిజెపిలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ పదవిని ఆయనతోనే భర్తీ చేస్తారని టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.

* విజయసాయిరెడ్డి సమాచారంతోనే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో మద్యం పాలసీ మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో మద్యం కుంభకోణం ద్వారా 3500 కోట్ల రూపాయలకు పైగా పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ 5 నిందితుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఈ మద్యం కుంభకోణం విషయంలో తనకు ఏమీ తెలియదని.. సూత్రధారుడు రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి కీలక వాంగ్మలకు ఇచ్చారు. ఈ తరుణంలోనే రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. ఆయన సైతం విజయసాయిరెడ్డి పై విరుచుకుపడ్డారు. సాయి రెడ్డి బాగోతాన్ని బయటపెడతానని హెచ్చరించారు. అయితే ఈ పరిణామాల క్రమంలో విజయసాయిరెడ్డి తిరుమల వచ్చి మొక్కులు తీర్చుకోవడం విశేషం.

Also Read: గుజరాత్ టైటాన్స్ సంచలనం.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version